Drugs Caught at Rayadurgam: హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం.. కీలక నిందితులు అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. రాయదుర్గం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ అని స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు.

Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత
New Update

Drugs Caught at Rayadurgam: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆదివారం (నిన్న) సైబరాబాద్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. గోవా (Goa) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) డ్రగ్స్‌ తీసుకొచ్చిన 32 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా, గ్రాము కొకైన్ ను రూ.30 వేలకు అమ్ముతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

స్పెషల్ ఆపరేషన్ టీమ్ కళ్లు కప్పి

హైదరాబాద్‌లో రాయదుర్గం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 32 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రాజమండ్రికి చెందిన విక్కీ, గోపి షెట్టి, రాజేష్, నరేష్‌ల‌ అనే నింధితులకు పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి కొకైన్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. సంపన్నులే టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు. విక్కీని పట్టుకోవడానికి గత సంవత్సరం నుంచి ఎస్ఓటీ పోలీసులు వల వేశారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ కళ్లు కప్పి విక్కీ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. విక్కీ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పట్టుకున్న ఎస్ఓటీ తెలిపారు. నలుగురుపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

పలు ప్రాంతాల్లో వీకెండ్‌లో డ్రగ్స్‌కు డిమాండ్

పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, మరో వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు కీలక నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. దానికి తోడు నగరంలోని పలు ప్రాంతాల్లో వీకెండ్‌లో డ్రగ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో దానిని సొమ్ము చేసుకోవాలని చూశారని పోలీసులు తెలిపారు. అందుకే గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి దందా నిర్వహిస్తున్నారు. గోవాలో తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీకెండ్‌లో డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో వాటిని తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయించాలని ఇద్దరు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులు కూడా వేర్వేరుగా తమ సొంత కార్లలో గోవాకు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో వీకెండ్‌లో గ్రాము కొకైన్ రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతునట్లు సమాచారం.

డ్రగ్స్ పెడ్లర్ల లింకులపై

సినీ నటుడు నవదీప్‌ (Navdeep) కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 10న( సోమవారం) విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. డ్రగ్స్ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్‌గా తీసుకున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case) సినీ పరిశ్రమకు డ్రగ్స్ లింకులున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సినీ నటుడు నవదీప్ ఫోన్ కాల్ లిస్టు, బ్యాంకు అకౌంట్స్ ట్రాన్జక్షన్స్‌పై తోపాటు డ్రగ్స్ పెడ్లర్ల లింకులపై విచారించనున్నారు. సెప్టెంబర్14న బెంగళూరులో పట్టుబడిన నైజీరియన్ డ్రగ్స్‌ పెడ్లర్లతో నటుడు ఉన్నాడని పోలీసు దర్యాప్తులో తెలిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: బాలికల వసతి గృహంలో ఆగంతకుల కలకలం.. అందుకే వచ్చారా..?

#rayadurgam-drug-case #drugs-caught-at-rayadurgam #hyderabad-drugs-case #hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి