Hyderabad: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’ (Rapido) కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..Hyderabad: అయ్యో పాపం రాపిడో రైడర్.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్!
హైదరాబాద్‌లో ఓ రాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. మార్గమధ్యలో తన బండిలో పెట్రోల్ అయిపోయినా కస్టమర్ కిందకు దిగలేదు. దీంతో అతన్ని స్కూటీపై కూర్చోపెట్టుకుని తోసుకుంటూ బంకు వరకూ వెళ్లాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.
Translate this News: