Hyderabad: అయ్యో పాపం రాపిడో రైడర్.. ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్! హైదరాబాద్‌లో ఓ రాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. మార్గమధ్యలో తన బండిలో పెట్రోల్ అయిపోయినా కస్టమర్ కిందకు దిగలేదు. దీంతో అతన్ని స్కూటీపై కూర్చోపెట్టుకుని తోసుకుంటూ బంకు వరకూ వెళ్లాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. By srinivas 12 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’ (Rapido) కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా ఓ ర్యాపిడో డ్రైవర్‌కు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ అయిపోయినా కస్టమర్ బైక్ దిగకపోవడంతో అలానే తోసుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది. @rapidobikeapp @Olacabs @UberIN_Support @hyderabad #FunFact #rapido #bike #TRENDING Just for fun. pic.twitter.com/twFRRP6bl5 — Saleem (@Saleemammu) February 10, 2024 కస్టమర్ ను ఎక్కించుకుని తోసుకుంటూ.. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో ఓ వ్యక్తి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో బుక్ చేసుకున్న కస్టమర్‌ను అతడి గమ్యస్థానంలో దింపాల్సి ఉండగా.. మార్గమధ్యలో సడెన్‌గా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల పెట్రోల్ బంకులు కూడా లేకపోవడంతో.. బైక్‌ను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంచెం బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను కోరాడు బైక్ రైడర్. దానికి కస్టమర్ ససేమిరా నో చెప్పేశాడు. ఇక ఏం చేయాలో తెలియక అలాగే కస్టమర్‌ను బైక్‌పై కూర్చోపెట్టుకుని తోసుకుంటూ వెళ్లాడు. ఇది కూడా చదవండి : Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ క్షణాల్లో వైరల్.. ఇక ఈ తతంగాన్ని వెనకాల నుంచి వస్తోన్న ఓ కారులోని వారు వీడియో తీసి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. బంకు వరకు నడుచుకుంటూ వెళ్లలేరా ఆ మాత్రం.? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మనుషుల్లో మానవత్వం అనేది మంటగలిసిపోతోందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు బైక్ రైడర్ పరిస్థితి చూసి జాలిపడ్డారు. కాగా, ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇలా కూడా ఉంటారా?, ఇదెక్కడి కర్మ రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. #video-viral #hyderabad #rapodi-rider మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి