Hyderabad : డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌లు... విదేశాలకు పరారయిన నిందితులు

హైదరాబాద్ రాడిసన్‌ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ లాంటి వారిని విచారించారు కానీ అసలు నిందితులు అయిన నీల్ విదేశాలకు పరారయినట్టు తెలుస్తోంది. దాంతో పాటూ నటి లిషి కూడా కనిపించడం లేదు.

New Update
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Radisson Drugs Case : హైదరాబాద్(Hyderabad) గచ్చిబౌలీ పోలీసులకు(Gachibowli) హోటల్ రాడిసన్ డ్రగ్స్ కేసు(Radisson Drugs Case) పెద్ద సవాల్‌గా తయారయింది. ఈ కేసులో పదిమంది వీఐపీలతో పాటూ డైరెక్టర్ క్రిష్‌(Director Krish) కూడా నిందితుడిగా అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. కానీ ఇందులో ముఖ్య నిందితులు అయిన ఏ9గా ఉన్న నీల్ మాత్రం నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కడం లేదు. ఇతని ఆచూకీ కోసం ప్రయత్నించగా విదేశాలకు జంప్ అయినట్లు తెలసింది. దాంతో పాటూ యూట్యూబర్ లిషి(Youtuber Lishi) కనిపించడం లేదని ఆమె సిస్టరే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో ట్విస్ట్. ఇక ఇదే కేసులో నిందుతుగా ఉన్న సందీప్, శ్వేతలు కూడా పరారీలోనే ఉన్నారు.

ఇక రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహించిన మంజీరా గ్రూపు(Manjeera Group) సంస్థల డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌, నిర్భయ్‌ సింధి (26), సలగంశెట్టి కేదార్‌నాథ్‌(36) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి సోమవారం విచారణకు హాజరవుతానని చెప్పారు. ఇక ఈ కేసులో మరో నిందితుడు ఏ4గా ఉన్న రఘుచరణ్ నిన్న గచ్చిబౌలీ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు.

పెరుగుతున్న నిందితుల సంఖ్య..

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ(Drugs Party) నిర్వహణ కేసులో ప్రధాన నిందితుడు వివేకానంద్‌, అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసిన అబ్బాస్‌ అలీ జాఫ్రీతో పాటు మరో తొమ్మిదిమంది మీద పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందులో వివేకానంద్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌ను కూడా అరెస్టు చేశారు. అది కాకుండా డ్రగ్స్‌ సరఫరాదారు మీర్జా వహీద్‌ బేగ్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని ఈ కేసులో ఏ12గా చేర్చారు. హైదరాబాద్‌కే చెందిన మీర్జా వహీద్‌ బేగ్‌ వేర్వేరు మార్గాల్లో డ్రగ్స్‌ తీసుకొచ్చి.. సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీకి విఅమ్ముతాడు. అతను ఈ డ్రగ్స్‌ను వివేకానంద్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్‌ ద్వారా వివేకానంద్‌కు డ్రగ్స్‌ చేరాయని.. పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read : Andhra Pradesh : అనపర్తిలో పొలిటికల్ వార్..టెన్షన్‌.. టెన్షన్‌

Advertisment
తాజా కథనాలు