BJP : మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కేసు(Kidnap Case) లో ట్విస్ట్ చోటుచేసుకుంది. అయితే అతడిని తామే అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8 గంటలకు శ్రవణ్(Sravan) తో సహా నలుగురిని అరెస్టు చేశామని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పూరాలోని ఓ పోలింగ్‌బూత్(Polling Booth) లో రిగ్గింగ్(Rigging) కు పాల్పడుతున్నట్లు వీడియోను వైరల్ చేశారని శ్రవణ్‌పై కేసు నమోదైంది. వాస్తవానికి అది 2022లో పశ్చిమ బెంగాల్‌లో బహదూర్‌పుర అనే ప్రాంతంలో జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియోగా ఈసీ తేల్చింది.
Also Read: ఇకనుంచి TGతో వాహన రిజిస్ట్రేషన్లు.. కేంద్రం గెజిట్ జారీ
అయితే నిన్న సాయంత్రం సాధారణ దుస్తుల్లో కొందరు శ్రవణ్‌ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ శ్రవణ్‌ను కిడ్నాప్ చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ కిడ్నాప్‌పై ఆయన కుటంబ సభ్యులతో పాటు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కొందరు దుండగులు శ్రవణ్‌ను కిడ్నాప్ చేశారని ఆయన తండ్రి మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శ్రవణ్ ఆఫీసుకు దగ్గర్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించగా.. వారు మాఫ్టీలో వచ్చిన పోలీసులుగా గుర్తించారు. ఇక రాత్రి 8 గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురిని తామే అరెస్టు చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రకటించారు.
Also read: ఎన్టీఆర్ ను మోసం చేసిన మహిళ.. హైకోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో..!