Telangana : మరో రికార్డు సృష్టించనున్న హైదరాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌.. 18 అడుగుల ఎత్తులో ఎక్స్‌ప్రెస్‌ వే

దేశంలో అతిపొడవైన రింగురోడ్డుగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌ రీజనల్ రింగ్‌ రోడ్డు (ORR) మరో రికార్డును సొంతం చేసుకోనుంది. త్వరలో 18 అడుగుల ఎత్తులో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరగనుంది.

New Update
Telangana : మరో రికార్డు సృష్టించనున్న హైదరాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌.. 18 అడుగుల ఎత్తులో ఎక్స్‌ప్రెస్‌ వే

Hyderabad RRR : దేశంలో అతిపొడవైన రింగురోడ్డు (Ring Road) గా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌ రీజనల్ రింగ్‌ రోడ్డు (ORR) మరో రికార్డును సొంతం చేసుకోనుంది. కోటగోడ ఉట్టిపడేలా 18 అడుగుల ఎత్తులో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం జరగనుంది. నేషనల్ హైవేలు (National Highways), ముఖ్యమైన రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే చోట దీని ఎత్తు 30 అడుగుల వరకు ఉండనుంది. ఇండియా (India) లో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇంత ఎత్తులో ఎక్స్‌ప్రేస్‌ వేల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టు ఉన్న ఓఆర్ఆర్‌ ఎత్తు 11 అడుగులు మాత్రమే ఉంది.

Also Read: హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై వెళ్లేవారికి గుడ్‌న్యూస్..

ఉత్తర వైపు ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వంతెన నిర్మిస్తారు. పాదాచారులు దాటే అండర్‌పాస్ ఎత్తు గతంలో మూడున్నర మీటర్లు నిర్ధారించినప్పటికీ కూడా.. ఈ మధ్యే దాన్ని 4 మీటర్లకు పెంచూతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్తగా నిర్మించబోయే ఎక్స్‌ప్రెస్‌ వే (Express Way) లలో చిన్న అండర్‌పాస్‌ల క్లియరెన్స్ ఎత్తు 4 మీటర్లుగా నిర్ధారించారు అధికారులు. మరోవిషయం ఏంటంటే తెలంగాణ, ఏపీ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వరికొతల కోసం హర్వెస్టర్లు వినియోగిస్తుంటారు. ఈ భారీ వాహనాల ఎత్తు 4.3 మీటర్లు ఉంటుంది. ఇవి రోడ్డు దాటాలంటే అంతకంటే ఎత్తులో క్లియరెన్స ఉండాల్సి ఉంటుంది. అందుకే ఓఆర్‌ఆర్‌లో అండర్‌పాస్‌ల కనిష్ఠ క్లియరెన్స్‌ను 4.5 మీటర్లుగా నిర్ధారించారు. దానిమీద రోడ్డుమందం మరో మీటర్ కనిష్ఠంగా ఉండనుంది. దీనివల్ల అండర్‌పాస్‌లు ఉండే చోట రోడ్డు ఎత్తు ఐదున్నర మీటర్లుగా ఉండబోతుంది.

ఇక అండర్‌పాస్‌లు లేని ప్రాంతాల్లో వాటి ఎత్తును తగ్గించేందుకు వీలుంటుంది. అయితే ఈ రోడ్డులో మాత్రం ప్రతి అర కిలోమీటర్‌కు కనీసం చిన్నదో, పెద్దదో ఒక అండర్‌పాస్ ఏర్పాటు కానుంది. అందుకే అండర్‌పాస్‌ ఉన్న ప్రాంతాల్లో రోడ్డు ఎత్తును పెంచేసి ఆ తర్వాత తగ్గించినట్లైతే వేగంగా వెళ్లే వాహనాలకు ఆ ఎత్తుపల్లాలు ప్రమాదకరంగా మారుతాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు మొత్తం కనీసం 18 అడుగుల ఎత్తులో ఉండేలా రూపకల్పన చేశారు. ఈ రోడ్డులో 27 పెద్ద వంతెనలతో పాటు 309 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 187 అండర్‌పాస్‌లు ఉండబోతున్నాయి. ఇక నేషనల్, రాష్ట్ర హైవేలను దాటుతూ 11 ప్రాంతాల్లో ఇంటర్‌ ఛేంజ్‌లను సైతం నిర్మించనున్నారు.

Also Read: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

ఇదిలాఉండగా.. ఓఆర్‌ఆర్‌ ఉత్తరభాగం భూసేకరణ ప్రక్రియ అనేది ప్రస్తుతం తుది దశలో ఉంది. త్వరలోనే గ్రామాలవారీగా భూ పరిహారానికి సంబంధించి అవార్డులు పాస్‌ చేయనున్నారు అధికారులు. దీనివల్ల 158 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డు నిర్మాణం మార్గం సుగమం కాబోతుంది. మరో విషయం ఏంటంటే ఈ నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) యంత్రాంగం కూడా రోడ్డు నిర్మాణానికి వీలుగా అప్పట్లోనే డిజైన్లను సిద్ధం చేసుకుంది. కానీ ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో పనులన్ని ఆగిపోయాయి. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు