Hyderabad : ORRపై ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్ లోనే ఇద్దరు మృతి!
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా వారి పైకి ట్యాంకర్ దూసుకువెళ్లడంతో యువతి, యువకుడు మృతి చెందారు.