Hyderabad: సీఎం కేసీఆర్‌ది మత దురహంకారం: బండి సంజయ్

సీఏం కేసీర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని ముస్లింలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం మరియు సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Hyderabad: సీఎం కేసీఆర్‌ది మత దురహంకారం: బండి సంజయ్
New Update

సీరియస్‌

సీఏం కేసీర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుని ముస్లింలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. రజకులు, నాయి బ్రాహ్మణుల మాదిరిగా లాండ్రీలు, బట్టలుతకడం మరియు సెలూన్ల నిర్వహణపై ఆధారపడిన ముస్లింలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అయితే.. ఈ విషయంపై బండి సంజయ్‌ సీరియస్‌ అయ్యారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న బీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

గల్లీ గల్లీలో లాండ్రీ షాపులు వస్తాయి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటన.. ప్రచురణార్థం అని అన్నారు. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఖండిచారు. ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆయన పేర్కొన్నారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా..? అని ప్రశ్నించారు. ఈ నయా నిజాంకు మత పిచ్చి ఎక్కువైంది. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజంలో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని సీఎంపై సంచనల ఆరోపణలు చేశారు.

ఆర్థికంగా దెబ్బతీసి అయినా..

కేసీఆర్‌ది మత దురహంకారం అని బండి సంజయ్‌ అన్నారు. బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే MIMను సంతృప్తి పరచాలన్నది కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీల కులవృత్తులపై దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు ఎత్తేసినట్టుగా ఉందన్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బీజేపీ అండగా ఉంటుంది. సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారం పై పోరాడుదాం. కులవృత్తులను కాపాడుకుందాం అంటూ బండి సంజయ్ ప్రజలు విజ్ఞప్తి కేశారు.

#hyderabad #bandi-sanjay #cm-kcr #religious-arrogance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి