హైదరాబాద్‌ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..ఏం తినేట్టు లేదంటున్న సామాన్యుడు!

హైదరాబాద్‌ లో కూరగాయల ధరలు సామాన్యుడికి గుండె నొప్పి తెప్పిస్తున్నాయి. 200 రూపాయలు తీసుకుని మార్కెట్‌ కి వెళ్తే కనీసం రెండు రకాల కూరగాయలు కూడా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.

New Update
హైదరాబాద్‌ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..ఏం తినేట్టు లేదంటున్న సామాన్యుడు!

నిన్న మొన్నటి వరకు కార్తీకమాసం పుణ్యమా అంటూ కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కార్తీక మాసం అలా ముగిసిందో లేదో ఇలా మాంసం ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కూరగాయల ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. గతంలో 100 రూపాయలు పట్టుకెళితే..సంచినిండా కూరగాయలు వచ్చేవి.

ఇప్పుడు 1000 రూపాయలు పట్టుకెళ్లినా కనీసం జేబు నిండే కూరగాయలు కూడా రావట్లేదు. దీంతో సామాన్యుడు కంటతడిపెడుతున్నాడు. గత సోమవారం వరకు కనీసం చికెన్‌ అయినా 100 లోపు దొరికేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. చలికాలం రావడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. పంట చేతికి సరిగా అందకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రస్తుతం మార్కెట్లో అతి చీప్‌ గా దొరుకుతున్న కూరగాయ ఏదైనా ఉంది అంటే అది కేవలం టమాటలు ఒక్కటే. అవి మాత్రమే కిలో రూ. 25 రూపాయలుగా ఉన్నాయి.మిగిలిన ఏ కూరగాయలను కదిపిన 50 రూపాయలకు తక్కువ లేవు. బెండకాయలు 60 రూపాయలుగా ఉంటే..చిక్కుడు కాయలు 65 రూపాయలుగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఉల్లి, వెల్లుల్లి ధరలు అయితే గత కొద్ది నెలలుగా కిందకి దిగిరావడం లేదు. ఇప్పుడు వాటికి తోడుగా అల్లం, ఆకు కూరలు కూడా చేరాయి. కిలో వెల్లుల్లి హోల్‌ సేల్‌ లో రూ. 240 పలుకుతుంది. మొన్న కురిసిన వర్షాల వల్ల పండిన పంట కొట్టుకుపోయింది. కొత్త పంట రాకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగినట్లు వ్యాపారస్తులు తెలుపుతున్నారు.

Also read: చైనాలో ఆల్‌ అవుట్ ఆపరేషన్‌ కు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు