Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..!

హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..!
New Update

Hyderabad Rains: హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబిడ్స్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

Also Read: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!

పలుచోట్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై నడిచేప్పుడు మ్యాన్ హోల్స్ ను చూసుకోని నడవాలని GHMC సిబ్బంది సూచించారు. ట్రాన్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను తాకవద్దని.. ముఖ్యంగా చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని తెలిపారు.

#hyderabad #hyderabad-rains #telangana-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి