Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..! హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Sep 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hyderabad Rains: హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబిడ్స్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. Also Read: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..! పలుచోట్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులు వదిలే సమయం కావడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై నడిచేప్పుడు మ్యాన్ హోల్స్ ను చూసుకోని నడవాలని GHMC సిబ్బంది సూచించారు. ట్రాన్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను తాకవద్దని.. ముఖ్యంగా చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని తెలిపారు. #hyderabad #hyderabad-rains #telangana-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి