Chicken rates: నాన్ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్‌..భారీగా తగ్గిన చికెన్‌ ధరలు!

కార్తీక మాసం మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లో చికెన్‌ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్‌ స్కిన్‌ రూ. 150, స్కిన్‌ లెస్‌ రూ. 170 లుగా ఉంది.

New Update
Chicken rates: నాన్ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్‌..భారీగా తగ్గిన చికెన్‌ ధరలు!

నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న చికెన్‌ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గాయి. ఒకానొక సమయంలో చికెన్‌ కేజీ రూ. 300 కి చేరుకున్నాయి. ఇప్పుడు కార్తీక మాసం మొదలు కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఎన్నికల ఊపు మీద చికెన్‌ ధరలు బాగా పెరిగాయి.

అయితే కార్తీక మాసం మొదలు కావడంతో నాన్ వెజ్‌ తినేవారు తగ్గడంతో చికెన్‌ ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ అయితే రూ. 150 , స్కిన్‌ లెస్‌ అయితే రూ. 170 గా ఉంది. గత నాలుగు నెలలతో పోల్చుకుంటే చికెన్‌ ధరలు భారీగా దిగిరావడం ఇదే. గత నాలుగు నెలల్లో చికెన్‌ ధరలు దిగిరావడం ఇదే కావడం విశేషం.

ధరలు తగ్గాయి కదా అని కోళ్లను అట్టిపెట్టుకోవడం కుదరదు. లేకపోతే మేత ఖర్చు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవడం ఖాయం. దీంతో మార్కెట్లో కూడా డిమాండ్‌ తగ్గడం, భారీగా కోళ్లు రావడంతో ధరలు ఆటోమేటిక్‌ గా ధరలు తగ్గుతాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్‌ అమ్మకాలు సుమారు 50 శాతానికి పడిపోయాయి.

కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్‌ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నట్లు నిర్వాహకులు వివరించారు. కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్‌ లో చికెన్‌ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో చికెన్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.

కిలో రూ. 320 నుంచి 350 రూపాయల వరకు వ్యాపారస్తులు అమ్మారు. ఎండల ప్రభావంతో పాటూ రవాణా ఛార్జీలు, కోళ్ల దాణా ఖర్చులు కూడా పెరగడంతో చికెన్‌ రేట్లు పెంచాల్సి వచ్చిందని వారు చెప్పారు. ఆనాడు మటన్‌ ధరతో పోటీ పడింది చికెన్‌. దాంతో చాలా మంది మటన్‌ వైపు మొగ్గు చూపడంతో పాటు..మరికొందరు చేపలు, రొయ్యల వైపు వెళ్లారు.

దీంతో చికెన్‌ అమ్మకాలు ఆ సమయంలో పడిపోయాయి. దీంతో చికెన్ వ్యాపారులు ఉసూరుమన్నారు.వేసవి కాలంలో ఎండలకు వేలాదిగా కోళ్లు చనిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగినట్లు వ్యాపారులు చెప్పారు.

Also read: సార్‌ నన్ను కాటేసింది ఈ పామే…వెంటనే ఇంజక్షన్‌ చేయండి!

Advertisment
తాజా కథనాలు