GHMC: మరింత పెరగనున్న హైదరాబాద్.. జీహెచ్ఎంసీలో 51 గ్రామాలు విలీనం!

హైదరాబాద్ పరిధి మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి.

GHMC: మరింత పెరగనున్న హైదరాబాద్.. జీహెచ్ఎంసీలో 51 గ్రామాలు విలీనం!
New Update

Hyderabad: హైదరాబాద్ మహానగరం మరింత పెరగనుంది. ఇప్పటికే దాదాపు 50 కిలోమీటర్లు విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధి మరో పది కిలోమీట్లర మేర పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ మేరకు 51 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఓఆర్ఆర్ఆర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలవనున్నాయి. పెద్ద అంబర్ పేట, కుత్బుల్లాపూర్, నాగారం, తూంకుంట, తుక్కుగూడ, నార్సింగి, శంషాబాద్ మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ మున్సిపాలిటీలో కలవనున్నాయి.

#sangareddy #hyderabad #ghmc #51-villeges
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe