Hyderabad: ప్రవళిక మృతి ఘటనలో నిర్లక్ష్యం.. చిక్కడపల్లి సీఐపై సస్పెన్షన్ వేటు.. ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. By Shiva.K 15 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Cikkadapalli CI Suspend: ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం వల్లనే ఆమె ప్రాణం తీసుకుందన్న వార్త దావానలంలా వ్యాపించటంతో ఆరోజు రాత్రి వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ గుమిగూడి ఆందోళన జరిపారు. ఒక దశలో పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు ప్రవళికది ప్రభుత్వం చేసిన హత్య అంటూ తీవ్ర విమర్శలు చేసారు. దీనికి కారణం చిక్కడపల్లి సీఐ నరేష్ సకాలంలో స్పందించక పోవటమే అంటూ కమిషనర్ కు నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ప్రవళిక మృతదేహాన్ని హాస్టల్ నుంచి మార్చురీకి తరలించి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. దీని ఆధారంగానే సీఐని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రవళిక ఆత్మహత్య.. ప్రవళిక వ్యక్తిగత కారణలతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రవళిక మృతికి సంబంధించి వివరాలు వెల్లడించిన డీసీపీ.. 'శివరామ్, ప్రవళిక ఇద్దరూ నగరంలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ కూడా మాకు దొరికింది. ఆమె తమ్ముడు ప్రణయ్ కూకట్‌పల్లిలో డిగ్రీ చేస్తున్నాడు. ప్రవళికకు సంబంధించిన లవ్ లెటర్, సీసీ కెమెరా ఫుటేజ్, మైబైల్ ఫోన్, సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని’ తెలిపారు. ఇప్పటివరకు ఆమె ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. శివరామ్ రాథోడ్‌పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని.. పూర్తి స్థాయిలో విచారణ చేసి మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనపై ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిన నాయకులపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. Also Read: CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్ చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన #telangana-news #telangana #hyderabad-news #pravalika-death-case #chikkadapalli-ci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి