Hyderabad: ప్రవళిక మృతి ఘటనలో నిర్లక్ష్యం.. చిక్కడపల్లి సీఐపై సస్పెన్షన్ వేటు..
ప్రవళిక విషాదాంతం నేపథ్యంలో చిక్కడపల్లి సీఐ నరేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేసారు. వరంగల్ కు చెందిన ప్రవళిక 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ప్రవళిక హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.