Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. వ్యక్తికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బా పేలడంతో షకీల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. షకీల్ చెత్తను సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Tamil Nadu Blast: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడలో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ డబ్బా పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆ పక్కనే ఉన్న భవనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడలో షకీల్ అనే వ్యక్తి చెత్తను సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక బాక్స్ కనిపించగా.. దానిని ఓపెన్ చేశాడు. అయితే, అది కెమికల్ బాక్స్ కావడంతో.. ఓపెన్ చేయగానే భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి షకీల్ దూరం ఎగిరి పడ్డాడు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు సైతం భయబ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని పోలీసులకు, అంబులెన్స్‌కి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన షకీల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

సీఎం ఆఫర్‌పై స్పందించిన నళిని.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన..

11 మంది IASల బదిలీ

Advertisment
తాజా కథనాలు