Madhavi Latha: హైదరాబాద్ పోలీసులకు మాధవీలత మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తే విడిచిపెట్టొద్దని కోరారు. పోలీసులు ఎక్కడైనా ఎంఐఎంకు సపోర్ట్ చేస్తే బాగుండదని అన్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్ చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. బురఖాల్లో చిన్నారులు, మగవారితో దొంగ ఓట్లకు ఎంఐఎం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఫేస్ ఐడెంటిటీ చేయకుండా అడ్డుకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పోలీసులు కాంప్రమైజ్ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం అని అన్నారు. ఎంఐఎంను పూర్తిగా బ్యాన్ చేసే వరకు పరిస్థితిని తీసుకెళ్తాం అని హెచ్చరించారు.
ALSO READ: బీజేపీ గెలుస్తే అమిత్ షానే ప్రధాని.. క్లారిటీ
అన్ని జిల్లాల్లో 144 సెక్షన్..
ఇక మే 13న ఎన్నికలు ముగిసే వరకు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లు తనిఖీ చేయనున్నారు. రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి రాజకీయపరమైన సమావేశాలు, మెసెజ్ ల పంపకాలను ఎన్నికల సంఘం నిషేధించింది.