Amit Shah Reply To Arvind Kejriwal’s Statement: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తాను ప్రధాని అవుతానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. తాను ప్రధాని అవుతానని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలలో వాస్తవాలు లేవని అన్నారు. 75 ఏళ్లు దాటిన వ్యక్తి ప్రధాని కాలేరనే ఆచారం బీజేపీ పార్టీలో లేదని అన్నారు. గత 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ (PM Modi) దేశ అభివృద్ధి కోసం పని చేశారని.. ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ పార్టీ (BJP Party) అధికారంలోకి వస్తుందని అన్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. కాగా ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీసేందుకు ఆప్ అధినతే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి (INDIA Alliance) నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Amit Shah: బీజేపీ గెలుస్తే అమిత్ షానే ప్రధాని.. క్లారిటీ
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తాను ప్రధాని అవుతానని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అమిత్ షా. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని అన్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.
Translate this News: