Madhavi Latha: హైదరాబాద్ పోలీసులకు మాధవీలత మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తే విడిచిపెట్టొద్దని కోరారు. పోలీసులు ఎక్కడైనా ఎంఐఎంకు సపోర్ట్ చేస్తే బాగుండదని అన్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్ చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు. బురఖాల్లో చిన్నారులు, మగవారితో దొంగ ఓట్లకు ఎంఐఎం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఫేస్ ఐడెంటిటీ చేయకుండా అడ్డుకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పోలీసులు కాంప్రమైజ్ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం అని అన్నారు. ఎంఐఎంను పూర్తిగా బ్యాన్ చేసే వరకు పరిస్థితిని తీసుకెళ్తాం అని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Madhavi Latha: హైదరాబాద్ పోలీసులకు మాధవీలత మాస్‌వార్నింగ్
TG: పోలింగ్ రోజు ఎంఐఎం అల్లర్లు సృష్టిస్తే విడిచి పెట్టొద్దని హైదరాబాద్ పోలీసులను కోరారు మాధవీలత. పోలీసులు ఎక్కడైనా ఎంఐఎంకు సపోర్ట్ చేస్తే బాగుండదని అన్నారు. కేవలం బీజేపీ కార్యకర్తలనే టార్గెట్ చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు.
Translate this News: