హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు సైదాపూర్ మండలంలోని బొమ్మకల్, అమ్మన గుర్తి గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్‌పై ప్రజలకు నమ్మకం లేదు.. కాంగ్రెస్‌పైనమ్మకం ఉందని పొన్నం అన్నారు. హుస్నాబాద్ ప్రస్తుత శాసనసభ్యులు సమర్థుడైతే 1800 ఓట్లు ఉన్న అమ్మన గుర్తి గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సమర్థుడైన నన్ను హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి గెలిపించి.. శాసనసభకు పంపితే అభివృద్ధి చేస్తా అని పొన్నం తెలిపారు. సోనియాగాంధీ తుక్కుగూడ ద్వారా ఇచ్చిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని పొన్నం తెలిపారు. గ్యారెంటీ కార్డును రేషన్ కార్డు లాగా భద్రంగా ఉంచుకోండి, రూ. 500లకే సిలిండర్, ఆడబిడ్డలకు తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఆర్టీసీ బస్సులు ఫ్రీ, సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
This browser does not support the video element.
ఇది కూడా చదవండి: ఈ మిర్చి తింటే ఇంక అంతే సంగతులు..ప్రపంచంలో ఘాటైన మిర్చి ఇదే
రైతుబంధుతో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వడం జరుగుతుందని పొన్నం తెలిపారు. రైతు భరోసా కింద క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ రూ.4 వేల వరకు పెంచి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీని నమ్మండి గెలిపించండని ఆయన కోరారు. గ్రామాల్లో సర్పంచ్‌లు బాధతో ఉన్నారు, వర్కులు చేసిన బిల్లులు రాక పరేషాన్‌లో ఉన్నారు పొన్నం గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పెండింగ్ బిల్లులు చెల్లించడంతోపాటు గ్రామాల్లో ఉన్న కారోబార్, పారిశుద్ధ కార్మికుల సమస్యలు, గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రాణాళిక తీసుకుని అభివృద్ధి చేస్తామని పొన్నం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదు, ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పెట్టి అమలు చేశామన్నారు.
This browser does not support the video element.
అభివృద్ధిలో మాత్రం శూన్యం
కాంగ్రెస్ హయాంలో ఆపద వస్తే 108 వాహనం కుయ్‌కుయ్ మంటూ వచ్చేది, ఈరోజు ఆ పరిస్థితి ఉందా..? అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని మార్చాలని అనుకుంటున్నారని కితబు పలికారు. 30 రోజులు నా కోసం కష్టపడండి, 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా ఉంటా అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది, కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టు మీది నుంచి నీళ్లు పోయిన ఉక్కులెక్క ఉందన్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు అభివృద్ధి అవుతాయి, కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిలో మాత్రం శూన్యం అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
This browser does not support the video element.