Flight Fight:లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల గొడవ..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ మ్యూనిచ్ నుంచి బ్యాంక్ వెళుతున్న ఫ్లైట్ ను ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అరే ఏంట్రా అన్నీ బాగానే ఉన్నాయి కదా...ఇలా మధ్యలో ఎందుకు ఫ్లైట్ ల్యాండ్ అయిందబ్బా అని ఆరా తీస్తే..విమానంలో భార్య భర్తల గొడవపడడమే కారణం అని తెలిసింది. ఈ సంఘటన అందరినీ అవాక్కయేలా చేసింది. By Manogna alamuru 29 Nov 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ కు లుఫ్తాన్సా విమానం వస్తోంది. ఇందులో ఒక జంట ప్రయాణిస్తున్నారు. ఎక్కినప్పుడు బాగానే ఉన్నారు. మధ్యలో ఏమైందో తెలియదు సడెన్ గా గొడవలాడుకోవడం మొదలుపెట్టారు. పోనీ అదేదో వాళ్ళిద్దరి మధ్యా ఉంటే బాగానే ఉండేది. కానీ అది కాస్తా చిలికి చిలికి గాలి వాన అయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది. దీంతో విమానంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఎంతలా అంటే ఫ్లైట్ నే ఏకంగా ఎమర్జెనసీ ల్యాండింగ్ చేయాల్సినంతగా. దీంతో ఈ విమానాన్ని మళ్ళించి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. Also read:3.26 కోట్ల ఓటర్లు.. 2,290 అభ్యర్థులు.. 35,655 పోలింగ్ కేంద్రాలు: తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం ఇదే! భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఈ వార్త అందిన వెంటనే, భద్రతా సిబ్బంది విమానాశ్రయానికి చేరుకుని విమాన గేట్లు తెరవడానికి ప్రయత్నించారు. అయితే అసలు బార్యభర్తల మధ్య గొడవ ఎందుకు జరిగిందో మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. ముందు విమానాన్ని పాకిస్తాన్ లో దించాలనుకున్నారు కానీ భద్రతా కారణాల రిత్యా ఢిల్లీకి మళ్ళించారు. గొడవ పడిన జంటలో మద్యం తాగినట్లుగా గుర్తించారు. అతడిని ఢిల్లీలోని విమానశ్రయ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. లాస్ట్ మంత్ లో కూడా ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. అప్పట్లో ఒకతను మద్యం తాగి విమానంలో సీట్లను పాడు చేయడమే కాకుండా...ఫ్లైట్ లో ఉన్న మిగతా ప్రయాణికులతో కూడా గొడవ పెట్టుకున్నాడు. అతనిని కూడా మధ్యలో దించేసి ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. Also read:వేంకటేశ్వరుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు..రేవంత్ ప్రత్యేక పూజలు #flight #fight #wife-husband #lufthansa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి