Science: ఆయుష్షును పెంచే ఔషధం..ఎలుకలపై విజయవంతం మనుషుల ఆయుష్షును పెంచే మందు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఉన్న అలవాట్ల వలన మానవులు చాలా తొందరగా చనిపోతున్నారు. దీనిని అరికట్టేందుకు, పూర్వం రోజుల్లోలా ఎక్కువ కాలం బతికి ఉండేలా ఔషధాలను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. By Manogna alamuru 21 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సాధారణంగా అందరూ ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటారు. పెద్దలు కూడా నిండు నూరేళ్లు జీవించు అంటూ ఆశీర్వాదిస్తారు. కానీ ప్రస్తుతం మాత్రం సంపూర్ణంగా జీవించే పరిస్థితులు లేవు. తినే ఆహారం, వాతావరణ మార్పుల వల్ల మనిషి ఆయుష్షు క్రమక్రమంగా తగ్గిపోతోంది. అందుకే మనుషుల జీవితకాలాన్ని పెంచాలనే ఉద్దేశంతో సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అలా క్రియేట్ చేసిన ఓ ఔషధం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో మనుషుల ఆయుష్షు కూడా పెంచవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన MRC ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్‌లోని డ్యూక్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు తయారుచేసిన ఈ ఔషధానికి సంబంధించిన వివరాలు 'నేచర్' జర్నల్‌లో ప్రచూరితమైంది. ఈ ప్రయోగంలో భాగంగా ఇంటర్‌ల్యూకిన్-11 అనే ప్రొటీన్‌పై ఫోకస్ పెట్టారు పరిశోధకులు. వయసు పెరిగేకొద్ది శరీరంలో దీని స్థాయిలు కూడా పెరుగుతాయి. వృద్ధాప్యానికి ఇదే ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంటర్‌ల్యూకిన్ -11 ఉత్పత్తిని అడ్డుకునేందుకే ఓ మెడిసిన్‌ను డెవలప్ చేశారు. దీని కోసం 75 వారాల వయసున్న ఎలుకలపై ప్రయోగించారు. ఇది దాదాపు మనుషులకు 55 ఏళ్ల వయసుతో సమానం. ఈ ఔషధాన్ని ప్రయోగించిన ఎలుకల జీవితం కాలం 20 నుంచి 25 శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఎలుకల కండరాల పనితీరు మెరుగయ్యింది. ఎలుకలపై ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రస్తుతం మనుషులపై కూడా ప్రయోగిస్తున్నారు. ముందుగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న వాళ్లకి ఈ ఔషధం ఇచ్చినట్లు ప్రొఫెసర్ స్టువర్ట్ కుక్ చెప్పారు. Also Read:National: ఏడోసారి బడ్జెట్‌తో చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్ #human #medicine #age మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి