Hug Benefits : ప్రేమ(Love) లో పడితే ఆ ఎంజాయ్మెంట్(Enjoyment), హ్యాపీనెస్(Happiness) వేరుగా ఉంటుంది. ప్రేమ లోకంలో ఉన్నవారు.. ఈ లోకాన్నే మరిచిపోతారు. వారి ఆలోచలు ప్రపంచం చివరి అంచుల వరకు వెళ్తాయి. అయితే.. ప్రేమ జంటలు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. కానీ కౌగిలించుకోవడం(Hug) అనేది వారి మానసిక ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఈ విషయం తెలియని జంటలు చాలా మంది ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నారు. ఒక వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల సంతోషకరమైన హార్మోన్లు(Happy Hormones) విడుదలవుతాయని నిపుణులు అంటున్నారు. అయితే.. హగ్ డే సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు మానవ శరీరం ఎలా స్పందిస్తుంది..? శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? అనేదానిపై కొన్ని విషయాలు తెలుసుకుందాం.
శరీరంలో మార్పులు:
- హగ్గింగ్(Hugging) వల్ల ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది.ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకోవడం, ప్రవర్తనలో మార్పుతో పాటు అనేక రకాల వ్యాధులను నివారిస్తుంది. పరస్పర కలహాల తర్వాత.. కౌగిలించుకోవడం మనోవేదనలను తొలగించడంలో సహాయపడుతుంది. జంటలు ఒకరితో ఒకరు పోట్లాడినప్పుడు.. అది మానసిక ఒత్తిడి పడి అనేక వ్యాధులకు దారి తీస్తుంది. కౌగిలింత ఈ ఒత్తిడి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు కౌగిలించుకోవడం వల్ల ఆరోగ్యం తొందరగా బాగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!
దుఃఖాలను దూరం:
- ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు శరీరం ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. షాక్‌లో, విచారంలో ఉన్నప్పుడల్లా.. ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకుంటే ఎల్లప్పుడూ సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది.
ప్రేమ మరింత పెరుగుతుంది:
- ఎవరినైనా నిజంగా ప్రేమిస్తున్నట్లయితే.. వారిని కౌగిలించుకోవడం వలన భావోద్వేగమైన క్షణం, కళ్ళు తేమగా మారవచ్చు. ఇది మీకు భిన్నమైన అనుభూతిని ఇవ్వటంతో పాటు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఆ వ్యక్తి పట్ల మీకున్న ప్రేమ మరింత పెరుగుతుంది. ఇది మీకు ఇష్టమైన వ్యక్తికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది.
ఇది కూడా చదవండి: ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటే ఈ వ్యాధి గ్యారంటీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.