Praja Palana: ప్రజాపాలన.. @40.57 లక్షల దరఖాస్తులు

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల్లో ప్రజల నుంచి 40.57 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Praja Palana: ప్రజాపాలన.. @40.57 లక్షల దరఖాస్తులు
New Update

Six Guarantees Applications: ఆరు గ్యారెంటీల పథకాల దరఖాస్తు కోసం తెలంగాణ ప్రభుత్వం చేప్పట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రజల నుంచి దరఖాస్తులు వెలువడుతున్నాయి. మూడో రోజు 18.29 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మొత్తం మూడురోజుల్లో ప్రజల నుంచి 40.57 లక్షల దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. తొలి రెండు రోజుల్లో 15.59 లక్షల అప్లికేషన్లు రాగా మూడో రోజుమాత్రం భారీస్థాయిలో వచ్చాయి. అభయహస్తంలోని ఐదు గ్యారెంటీలకు శనివారం ఒక్క రోజే 15.88 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మిగిలినవన్నీ ఇతర అంశాలకు సంబంధించినవని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మూడు రోజులవ్యవధిలో మొత్తం 3,868 గ్రామ పంచాయతీలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన ద్వారా గ్రామసభలు, సదస్సులు పూర్తయినట్లు తెలిపారు.

ALSO READ: పెండింగ్ చలాన్లు.. ప్రభుత్వానికి లక్షల కోట్లు.. ఐదురోజుల్లోనే ఎంతంటే..

ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు వచ్చాయని.. జిహెచ్ఎంసీ(GHMC), పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు వస్తే రెండో రోజున 8.12 లక్షలు వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రెండు రోజుల్లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో పల్లెల నుంచి 6.12 లక్షలు వస్తే, పట్టణాల నుంచి 9.46 లక్షలు వచ్చినట్లు తెలిపారు.

నేడు (ఆదివారం) రేపు నూతన సంవత్సరం కావడంతో దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించారు. 2నుంచి 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ పథకాల లబ్ధిదారులు.. దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరమైన సంఖ్యలో దరఖాస్తులు.. అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. దరఖాస్తులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ ఉచితంగానే అప్లికేషన్లు ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. 6వ తేదీ తర్వాత ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో అప్లికేషన్లు ఇవ్వొచ్చని అధికారులు అంటున్నారు.

ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

#praja-palana #telangana-news #prajapalana-abhayahastham-application #congress-six-guarantees #six-guarantees-applications
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe