BJP Meeting : కేంద్ర బీజేపీ (BJP) లో పెను మార్పులు జరుగనున్నాయని టాక్ నడుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం అయితే సంపాదించింది కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ మార్కును మాత్రం సాధించలేకపోయింది. దాంతో ఆ పార్టీకి మిత్ర పక్షాల మీద ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ నేపథ్యం, 400 టార్గెట్ రీచ్ అవకపోవడంతో ప్రధాని మోదీ (PM Modi) సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ను..పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
దీనికి సంబంధించి ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు, సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానం మార్పు మీద ఇప్పటికే శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చర్చలు జరిపారని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ చేయడంలో శివరాజ్‌సింగ్ కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయనకు పార్టీలో కూడా ప్రముఖ స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది,
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ఢిల్లీకి రానున్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 33సీట్లకే పరిమితమయిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీతో మాట్లాడనున్నారు. బీజేపీకి కంచుకోట అయిన యూపీలో సీట్లు తగ్గడం ఆ పార్టీని కలవరపెట్టే విషయం. అది కూడా అయోధ్యలాంటి స్థానాల్లో ఆ పార్టీ గెలవలేకపోవడం చాలా పెద్ద దెబ్బ. అందుకే ఈ విషయమై మోదీ..నేతలతో చర్చించాలనుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పాటూ ఓవరాల్‌గా భారీగా సీట్లు తగ్గడంపై కూడా ఇవాల్టి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Telugu:Stock Markets: భారీ నష్టాల తరువాత వరుసగా రెండో రోజు లాభాల్లో దేశీ మార్కెట్లు