AP : నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి.. జగన్ పై దాడి కేసులో పోలీసు కమిషనర్ ప్రకటన!

ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

New Update
AP : నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి.. జగన్ పై దాడి కేసులో పోలీసు కమిషనర్ ప్రకటన!

CM Jagan Stone Attack: విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర(Memantha Siddham Bus Yatra) లో సీఎం జగన్(CM Jagan) పై కొందరు ఆగంతకులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఇష్యూను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి ఎలా జరిగింది? ఎయిర్‌ గన్‌(Air Gun) తో దాడి చేశారా? లేదంటే క్యాట్‌బాల్‌తో కొట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి చేసిన నిందుతలను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్(Police Commissioner) ప్రకటించారు.  ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామని, వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.

publive-image

ఇది కూడా చదవండి: Hyderabad: ఫోన్‌ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!

అదుపులో నలుగురు..
అలాగే పాటూ గంగానమ్మ గుడి దగ్గర సెల్‌ టవర్‌ పరిధిలో కాల్స్‌పై నిఘా కూడా పెట్టారు పోలీసులు. స్కూల్‌కి, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి దాడి జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ కేసు విషయమై పోలీసులు ఇప్పటి వరకు 40 మందికిపైగా విచారించారు. 24 సీసీ కెమెరాల్లో ఫుటేజ్‌ పరిశీలన చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి(CP Kranthi). ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి విచారణ జరుపుతోంది. అజిత్‌సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మొత్తం ఆ స్థలంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు