వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
ఇంటి వద్ద నుంచే భోజనం తీసుకుని వచ్చి పెడుతున్నప్పటికీ కూడా మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే ...ఇప్పుడు మాకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు లైఫ్ కి ఇలాంటి రిస్క్ లేదు..చంద్రబాబుకి పంపించే భోజనంపై నాకు అనుమానం ఉంది..ఆయనకు పెట్టె భోజనం ముందు లోకేష్ కి తినిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also read: నవరాత్రుల్లో మూల నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత..ఆరోజు చేయాల్సిన విశేష పూజ ఏంటి!
విశాఖ పట్నం మీద ఎందుకు విపక్షాలు వివక్ష చూపుతున్నాయో అర్థం కావడం లేదు. అసలు విశాఖలోనే ఈనాడు పుట్టింది. అయినప్పటికీ విశాఖ మీద రామోజీ రావు ఎందుకు విషం చిమ్ముతున్నారు. పురందేశ్వరి, పవన్, ఈనాడు పత్రికల యజమానులు అందరూ కూడా నాన్ లోకల్స్..ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అనేది లోకల్స్ కి, నాన్ లోకల్స్ కి మధ్య జరిగే యుద్దం.
జగన్ నిన్న మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రజలందరూ కూడా సమర్థిస్తున్నారు. జనసేన అధినేత పవన్ ఏపీని ఓ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్ ల ఉపయోగించుకుంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ ఓడిపోయిన తరువాత ఎన్నిసార్లు పవన్ గాజువాకను వచ్చారని అమర్నాథ్ ప్రశ్నించారు.
రుషి కొండ పక్కన గీతం కాలేజీ యాజమాన్యం కబ్జా చేస్తే ఒక్క టీడీపీ నేత మాట్లాడలేదు.
ఇప్పుడు విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు కడతామంటే మాత్రం అడ్డుపడుతున్నారు. మీరు రియల్ ఎస్టేట్ కోసం..జగన్ గారు స్టేట్ కోసం ఆలోచిస్తారని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గుతే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని…జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.