Sankranthi Festival:కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం. జనవరి వచ్చేసింది. ఏడాది మొదలవుతూనే మనకు వచ్చే పండగ సంక్రాంతి. దేశంలో చాలా చోట్ల ఈ పండుగను వేరేవేరే పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇదే పెద్ద పండగ. భోగీ, కనుమ, ముక్కనుమతో కలిపి నాలుగు రోజులు చేసుకునే పండుగకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ముగ్గులతో, ఆడపడుచులతో మెరిసిపోయే ఈ పండుగ రోజులు ప్రతీ ఇంటికి కళను తీసుకువస్తాయి. మరి పండగల్లో హ్యాపీగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా. ఎలా కేర్ తీసుకోవాలో తెలుసా. లేదా అయితే మీ కోసమే ఈ చిట్కాలు.
ప్రతి ఒక్కరికి వివిధ రకాల చర్మాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ చర్మానికి సరైన క్లెన్సర్‌ని ఎంచుకోవడం ముఖ్యం. మనందరం పండుగ అనుభూతిని పొందాలి. ఈ దీపావళికి రెడీ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే. దీని వల్ల చర్మంపై ఉండే కాలుష్యాన్ని తొలగించి, పోర్స్ క్లీన్ చేయడానికి సాయపడుతుంది. మన చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో స్కిన్‌కి అవసరమయ్యే క్లెన్సర్‌లను ఎంచుకోండి. చర్మాన్ని ఎక్కువగా డ్రై అయ్యేలా చూడొద్దు.
చాలా సార్లు మనం ఎక్స్‌ఫోలియేషన్ చేయం. దీని వల్ల స్కిన్ కేర్ దెబ్బ తింటుంది. అయినప్పటికీ, చర్మ సంరక్షణలో ఎక్స్‌ఫోలియేషన్ అనేది కీ స్టెప్. డెడ్ స్కిన్ సెల్స్‌ని క్లియర్ చేయడం వల్ల మీరు క్లియర్, సాఫ్ట్ స్కిన్‌ని పొందుతారు. దీంతో పాటు, చర్మం వారానికి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. దీపావళికి దీపాల్లా మన ముఖం మెరుస్తుంది.
చర్మం జిడ్డుగా మారకుండా మెరిసే మాయిశ్చరైజర్ కావాలంటే విటమిన్ సి, విటమిన్ ఇ, ఇతర పదార్థాలతో కూడిన ఒకదాన్ని ఎంచుకోండి. అది మన చర్మాన్ని ఏ టైమ్‌లో అయినా మెరిసేలా చేస్తుంది. బొద్దుగా, మృదువుగా ఉండే చర్మానికి తేమ అవసరం. ఇది లోపల నుండి చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్‌ని అందిస్తుంది.
పండగలప్పుడు, పార్టీలప్పుడు విపరీతమైన పని ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా చర్మం మెరవదు. అలాంటి టైమ్‌లో ఫేస్ మాస్క్ మనకు హెల్ప్ అవుతుంది. మన బ్యూటీని పెంచేందుకు ఫేస్ మాస్క్ హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ కలర్‌ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.సీరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పండుగ సీజన్‌లో మీ స్కిన్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి సీరమ్స్ మంచి ఆప్షన్. బెస్ట్ సీరమ్ మన డెయిల్ స్కిన్ కేర్ రొటీన్‌ని త్వరగా మెరుగు పరుస్తుంది. అంతర్గతంగా మెరుపుని అందిస్తుంది. అయితే చర్మానికి అనుకూలమైన భాగాలు, ఫార్మూలాలతో ఉన్న సీరమ్‌ని మాత్రమే ఎంచుకోవాలి. స్కిన్ కేర్ ఎంచుకునేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ట్రై చేయాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.
వీటికి తోడు అదనంగా తాజా పళ్ళు, కూరగాయలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం చర్మాన్ని లోపల్నించి రిపేర్ చేసి మెరిసేలా చేస్తుంది. చివరగా, పండుగల సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. ఎక్కువ కేలరీలకి దూరంగా ఉండి వర్కౌట్ చేయండి. దీంతో మీ స్కిన్ మెరుపుని ఏవీ అడ్డుకోలేవు.