Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్‌ సాల్వ్!

కడుపుబ్బరం సమస్యలను గ్రీన్‌ టీ దూరం చేస్తుంది. ఇక అజీర్ణతకు కొబ్బరి నీళ్లు మంచి చిట్కా. అటు బొప్పాయి లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు అద్భుతంగా పని చేస్తుంది.

New Update
Health Tips : కడుపుబ్బరం సమస్య వేధిస్తుందా? ఈ చిన్న చిట్కాతో ప్రాబ్లెమ్‌ సాల్వ్!

Gastric Problem : కడుపుబ్బరం సమస్య(Gastric Problem) తో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలు(Simple Tips) పాటిస్తే సరిపోతుంది. అజీర్ణంగా ఉన్నప్పుడు అల్లం టీ(Ginger Tea), కొబ్బరినీళ్లు, అరటిపండు, బొప్పాయి, గ్రీన్ టీ తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వాటిలో ఒకటి జీర్ణక్రియ సమస్య. కొంత మందిలో తరచూ కడుపుబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కడుపుబ్బరంతో బాధపడే వారు ఈ సింపుల్ హోం రెమెడీస్ పాటిస్తే సరిపతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి

అరటి పండు
కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలిగించడంలో అరటి పండు(Banana) అద్భుతంగా పని చేస్తుంది. హెవీ ఫుడ్స్ తీసుకున్నపుడు అరటి పండు తింటే త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అంతే కాదు బనానా స్ట్రెస్ బస్టర్ గా కూడా పనిచేస్తుంది. ఆందోళనగా ఉన్నప్పుడు వీటిని తింటే మంచిది.

గ్రీన్ టీ
సహజంగా గ్రీన్ టీ(Green Tea) లోని కేటాచిన్ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తాయి.

బొప్పాయి
బొప్పాయి(Papaya) లోని పైపిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. వీటిలోని అధిక ఫైబర్, నీటి శాతం వ్యర్థాలను బయటకు పంపి వికారం , మలబద్దకం సమస్యలను తగ్గిస్తాయి.

అల్లం టీ
అల్లం టీ కడుపులో వికారం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉశమనం కలిగిస్తుంది. అంతే కాదు జీర్ణక్రియ పని తీరును కూడా పెంచుతుంది.

కొబ్బరి నీళ్లు
అజీర్ణతకు కొబ్బరి నీళ్లు(Coconut Water) మంచి చిట్కా . వీటిలో సహజ చక్కెర్లు, ఎలక్ట్రో లైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అజీర్ణత, వికారాన్ని తగ్గించి.. శక్తిని అందిస్తాయి

Also Read : పాకిస్తాన్ లోనూ హోలీ సంబురాలు..అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్..!

Advertisment
తాజా కథనాలు