Baking Soda & Powder : బేకింగ్ సోడా(Baking Soda), బేకింగ్ పౌడర్(Baking Powder) ప్రతి ఒక్కరి వంటగది(Kitchen) లో ఉంటుంది. వంట చేసేటప్పుడు, కూరగాయలు, మసాలాలు, ఇతర వస్తువులు ఇంట్లో వాడేస్తారు. ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు దీనిని కేక్, ధోక్లా తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా బేకింగ్ పౌడర్‌ని ఉపయోగిస్తారు. వీటితోపాటు మజ్జిగ, పెరుగు, నిమ్మరసం వంటివి చేసేటప్పుడు బేకింగ్ సోడా వాడుతారు. అయితే.. చాలామంది ఈ రెండు పదార్థాల గురించి అర్థం కాక అయోమయ పడుతూ ఉంటారు. ఈ రెండు పదార్థాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
తేడా తెలుసుకోవటం ముఖ్యం:
- ముఖ్యంగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాటి పేర్లు, రూపం ఉంటాయి. అందుకని వాటిమధ్య తేడాను అంత త్వరగా గుర్తించడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా దీనిని వడటం తెలియనివారికి వాటిని గుర్తించడం ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ రెండు పదార్థలను వాడలంటే ముందు వీటి గురించి పూర్తి సమాచారం తీసుకోవటం ముఖ్యం. అయితే ఈ రెండూ దేనికి ఉపయోగిస్తారో తెలియాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మధ్య తేడా ఏమిటో చూద్దాం.
ఆహారంలో టేస్ట్ పెరుగుతుంది:
- బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఈ రెండూ వంటల్లో టేస్ట్(Food Taste) పెంచడానికి వాడేస్తారు. అందుకేనేమో ఈ రెండిటి విషయంలో కాస్త కన్ఫ్యూస్ ఉంటుంది. అయితే.. మృదువుగా బేకింగ్ పౌడర్, ముతకగా బేకింగ్ సోడా ఉండటం వలన దానిని సులువుగా కనిపెట్టవచ్చు. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడాను కలిపితే ఎలాంటి తేడా ఉండదు. అదే.. గోరువెచ్చని నీటిలో బేకింగ్ పౌడర్ కలిపితే నీటిలో బుడగలు వస్తాయి. ఈ పద్ధతితో ఈ రెండింటిని మధ్య తేడాను గుర్తించవచ్చు.
ఇది కూడా చదవండి : అమ్మాయిలకు అక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. పట్టిందల్లా బంగారమే
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి : ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ అయితే జరిగేది ఇదే!