Hair Wash Tips : జుట్టును అందంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికి ఇష్టంగా ఉంటుంది. అయితే కొందరు జుట్టు (Hair) సంరక్షణ విషయంలో ఆందోళన చెందుతారు. ఈ సమయంలో కొన్ని తప్పులు కూడా చేస్తారు. దీనివల్ల సమస్యలతోపాటు జుట్టు పాడైపోతుంది. అయితే జుట్టును బలోపేతం చేయడానికి వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలని చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రతిరోజూ జుట్టు కడగితే సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి ఎన్ని సార్లు జుట్టు కడగాలని అనే దానిపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వారంలో జుట్టును ఎన్నిసార్లు కడగాలి, చేయకూడని తప్పులు:
- జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. జుట్టు చాలా జిగటగా, జిడ్డుగా ఉంటే ప్రతిరోజూ జుట్టును కడగాలి. కానీ జుట్టు చాలా పొడిగా ఉంటే.. జుట్టును వారానికి రెండు మూడు సార్లు మాత్రమే కడగాలి. జుట్టు సాధారణంగా ఉంటే వారానికి రెండు మూడు సార్లు కడగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- షాంపూతో జుట్టును కడిగినప్పుడల్లా చాలా వేడి నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడి నీరు జుట్టును పొడిగా, నిర్జీవంగా చేస్తుంది. అందువల్ల గోరువెచ్చని నీటిని జుట్టుకి ఉపయోగించాలి. జుట్టుకు షాంపూని ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి లేకుంటే జుట్టు త్వరగా తెల్లబడుతుంది.
- కండీషనర్ జుట్టుకు తేమను, మెరిసేలా చేస్తుంది. అయితే కండీషనర్‌ను ఎక్కువగా వాడితే జుట్టు దెబ్బతింటుంది. పొరపాటున కూడా తడి వెంట్రుకలను దువ్వకూడదని, తడి జుట్టుపై ఎక్కువసేపు టవల్ చుట్టకూడదని గుర్తుంచుకోవాలి.
- జుట్టును బలోపేతం చేయడానికి హెయిర్ మాస్క్‌లను ఎప్పటికప్పుడు ఉపయోగించాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రతి వ్యక్తి జుట్టు భిన్నంగా ఉంటుంది. మరిన్ని సమస్యలను ఎదుర్కొంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు, వాటిని బలోపేతం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల (Health Problems) నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది?