Bath: వారానికి మూడు రోజులు స్నానం చేస్తే సరిపోతుందా? నిపుణుల షాకింగ్‌ కామెంట్స్!

వారానికి మూడుసార్లు స్నానం చేస్తే సరిపోతుందని ఇటీవలి కాలంలో కొన్ని న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీరు ఏ వాతావరణంలో నివసిస్తున్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? అన్నదాని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇండియా లాంటి దేశాల్లో రోజుకు రెండుసార్లు స్నానం చేయాల్సి ఉంటుంది.

New Update
Bath: వారానికి మూడు రోజులు స్నానం చేస్తే సరిపోతుందా? నిపుణుల షాకింగ్‌ కామెంట్స్!

Bath: నైట్ నిద్రపోయే ముందు స్నానం చేయకపోతే నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. ఉదయం ఎప్పుడో ఆఫీస్‌కు వెళ్తారు.. నైట్‌ ఎప్పటికో వస్తారు. చాలా అలిసిపోయి ఉంటారు. ఎంత బద్ధకంగా అనిపించినా చాలామంది స్నానాన్ని మాత్రం స్కిప్ చేయరు. ముందు స్నానం చేసి తర్వాత తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్నానానికి అంత ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అయితే కొంతమంది అదేపనిగా స్నానం చేస్తుంటారు. రోజుకు నాలుగుసార్లు చేసేవారు కూడా ఉంటారు. బయటకు వెళ్లిన ప్రతిసారి బాత్‌ చేస్తుంటారు. ఇలా చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు చర్మ సంబంధిత నిపుణులు. వారానికి ఎన్నిరోజులు చేయాలో కూడా చెబుతున్నారు.

వారానికి మూడు సార్లు సరిపోతుందా?
ప్రతిరోజూ స్నానం చేయడం చిన్నప్పటి నుంచి అందరూ చేసేదే. స్కూల్లో కూడా పరిశుభ్రత పాఠంలో అదే నేర్చుకున్నాం. రోజుకు ఒక్కసారైనా స్నానం చేయాలని చెబుతుంటారు. కొంతమంది రోజుకు రెండుసార్లు కూడా స్నానం చేస్తారు. అయితే ఎంత తరచుగా స్నానం చేయాలనే దానిపై నిపుణుల సమాధానం షాకింగ్‌గా ఉంది. నిపుణులు అల్ రోకర్, షైన్లే జోన్స్, డైలాన్ డ్రేయర్ స్నానం ఎన్నిసార్లు చేయాలన్నదానిపై స్పందించారు. టీవీ టాక్ షోలో యాంకర్ వారానికి ఎన్నిసార్లు స్నానం చేయాలని అడిగారు. దీనిపై ముగ్గురు నిపుణులు స్పందించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. వారానికి మూడుసార్లు చేస్తే సరిపోతుందని చెప్పారు.

ఇది అందరికి వర్తిస్తుందా?
నిజానికి నిపుణులు చెప్పినదాని ప్రకారం వారానికి మూడుసార్లు చేయడమన్నది యావరేజ్‌గా సరిపోతుంది. కానీ మీరు ఏ వాతావరణంలో నివసిస్తున్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీ వయస్సు ఎంత? మీరు పనిచేసే ప్రదేశంలో వాతావరణం ఎలా ఉంటుంది? ఇది ఎంత తరచుగా స్నానం చేయాలనే దానిపై ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇటు ఇండియాకు వస్తే దేశంలో, స్నానం చేసే ఫ్రీక్వెన్సీ వాతావరణం, వ్యక్తిగత అలవాట్లు, సాంస్కృతిక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. వేడి, తేమ ఉన్న ప్రాంతాలలో, ప్రజలు సౌకర్యం కోసం తరచుగా స్నానం చేయడానికి ఇష్టపడవచ్చు. అయితే సాధారణంగా.. రోజుకు ఒకసారి స్నానం చేయడం దేశంలోని చాలా మంది వ్యక్తులకు ఒక సాధారణ పద్ధతి. పర్యావరణ కారకాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు వ్యక్తిగత ప్రాధాన్యతలు, పరిశుభ్రత అవసరాలకు అనుగుణంగా ఉండటం ముఖ్యం. అంటే మీరు ఉండే ప్లేస్‌ బట్టి మీరు రోజుకు రెండుసార్లు స్నానం చేయవచ్చు.

ఇది కూడా చదవండి: లైఫ్‌ పార్ట్‌నర్‌తో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే చేయాల్సింది ఇదే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు