కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం!

కువైట్‌లో నిన్న ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మందికి పైగా భారతీయులు చనిపోయారు.అయితే కువైట్ దేశ జనాభా 48 లక్షల మంది కాగా వారిలో 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వీరిలో చాలా మంది చేసే పనులు వచ్చే ఆదాయం గురించి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

New Update
కువైట్‌లో భారతీయ కార్మికులు చేసే ఉద్యోగాల గురించి వెల్లడించిన కేంద్ర రాయబార కార్యాలయం!

కువైట్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్ అగ్నిప్రమాదంలో 40 మంది భారతీయులు సహా మొత్తం 49 మంది చనిపోయారు. ఈ సంఘటన నిన్న  కువైట్ సిటీకి దక్షిణాన ఉన్న మంగాఫ్ ప్రాంతంలో, వలస కార్మికులు నివసించే ప్రాంతంలో జరిగింది. అగ్నిప్రమాదం జరిగిన 6 అంతస్తుల భవనంలో దాదాపు 200 మంది కార్మికులు నివసిస్తున్నారు.

అగ్ని ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఇవాళ భారత్‌కు కేంద్రం తీసుకొచ్చేంది. అలాగే, కువైట్ అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా భారతీయులు గాయపడ్డారని, వారిలో చాలా మంది పరిస్థితి బాగానే ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన భారతీయుల్లో ఎక్కువ మంది 20-50 ఏళ్ల మధ్య వయసున్న వారు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారని కువైట్ లోకల్ టీవీ తెలిపింది. దీని ప్రకారం, తమిళనాడు, కేరళ ,ఉత్తర భారతదేశానికి చెందిన చాలా మంది కార్మికులు ఈ భవనంలో 195 మందికి పైగా నివసిస్తున్నారు.

కువైట్‌లో దాదాపు 48 లక్షల మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు  10 లక్షల మంది భారతీయులే నివసిస్తున్నారు. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్‌లో కువైట్ జనాభా 48 లక్షలు. అందులో 15 లక్షల మంది మాత్రమే స్థానికులు. మిగతా 33 లక్షల మంది విదేశీయులే. వారిలో 61% మంది కూలీలుగా కువైట్‌కు వచ్చారు. ముఖ్యంగా కువైట్‌లోని ప్రవాసులలో మూడింట ఒకవంతు భారతీయులే.

ఉదాహరణకు, దుబాయ్‌లో కార్పెంటర్లు, మేస్త్రీలు, డ్రైవర్లు, ప్లంబర్ల పనులు ఎక్కువగా భారతీయులే చేస్తుంటారు. వీరికి నెలకు కనీసం 25 వేల భారతీయ రూపాయలు చెల్లిస్తారు. అంతకు మించి హెవీ వెహికిల్ డ్రైవర్లు, ఇంటి పనివాళ్లకు ఎక్కువ జీతం ఇస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు