ప్రస్తుత జీవిన విధానం వల్ల మనలో చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. మన జీవన విధానంలో గాలిపీల్చడం, ఆహారాన్ని తీసుకోవడం, నీటిని తాగడం ఎంత ముఖ్యమో అలాగే నిద్రపోవడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుత తరానికి నిద్ర పై అస్సలు శ్రద్ధ ఉండటం లేదని వారు అభిప్రాయపడ్డారు. దీనికి కారణం సెల్ ఫోన్లు, లాప్టాప్ లు రాత్రి 12 వరకు వాడటం. కానీ మన జీవన గడియారం నడవడానికి నిద్ర చాలా అవసరమన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరం. నిద్ర పోకుండా మనిషి ఎన్ని రోజులు జీవించగలడో తెలుసా?.. నిద్ర పోకుంటే వచ్చే ప్రమాదం ఏంటి?
ALSO READ: రుణమాఫీపై కీలక అప్డేట్.. చదవండి!
సాధారణంగా మనిషి ఒక రోజు నిద్రపోకపోతేనే రెండవ నీరసం అవుతారు. స్ట్రెస్ కూడా పెరుగుతుంది. మనిషికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఓపిక కూడా నశిస్తుంది. కోపం పెరిగిపోతుంది. ఇతరులు చెప్పేదాన్ని కూడా వినరు. సరైన నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి క్షిణిస్తుంది. అలాంటిది అసలు నిద్రపోకుండా రోజుల తరబడి ఉంటే ప్రాణాలే పోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఇక మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు జీవించగలడు అన్నదానిపై అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. నిద్ర పోని మనిషి మూడు రోజుల తర్వాత మంచానికే పరిమితమవుతారు. కొద్దికొద్దిగా శరీరం పనిచేయడమే మానేస్తుంది. అసలే నిద్రపోని మనిషి పదకొండు రోజుల మాత్రమే జీవించి ఉంటాడట. ఆ తర్వాత అతని మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిని పన్నెండవ రోజున మరణిస్తాడని అధ్యయనాలు పేర్కొన్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు మంచి నిద్ర కూడా అవసరం.
ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?