Head Phones: ఏ వయసు వారు హెడ్‌ఫోన్స్‌ని ఎంత సమయం వాడవచ్చు? హెడ్ ఫోన్స్ తో సంగీతం వినడం లేదా ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరంతోపాటు చెవిలో ఇన్ఫెక్షన్, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసు వారు ఎంత సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్ళండి. By Vijaya Nimma 21 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Head Phones: ప్రయాణంలో అయినా ఖాళీ సమయంలో అయినా చాలా మంది మొబైల్ ఫోన్‌లలో టైం పాస్ చేస్తుంటారు. పాటలు వినడానికి, సినిమాలు చూడడానికి హెడ్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతారు. అయితే హెడ్ ఫోన్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. ఒక సర్వే ప్రకారం.. 47 శాతం మంది ప్రజలు సంగీతం వింటున్నారు. 42 శాతం మంది ఇయర్ ఫోన్‌ల సహాయంతో కాల్స్ మాట్లాడతారు. అదే సమయంలో 20 శాతం మంది ప్రజలు హెడ్‌ఫోన్‌లను ఫ్యాషన్ కోసం వాడుతున్నారు. హెడ్‌ఫోన్స్ వల్ల సమస్యలు: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు ఎంత అవసరమో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కూడా తప్పనిసరిగా మారిపోయింది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సౌండ్‌తో సంగీతం వినడం లేదా ఎక్కువసేపు ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. హెడ్‌ఫోన్స్ వల్ల చెవిలో ఇన్ఫెక్షన్, వినికిడి లోపం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 19 నుంచి 29 సంవత్సరాలు: ఈ వయస్సులో ఉన్న వ్యక్తులు హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్ వినియోగాన్ని వారానికి గరిష్టంగా 7.8 గంటలు, నెలకు 33.9 గంటలు, సంవత్సరానికి 405.6 గంటలకు పరిమితం చేయాలని నిపుణులు చెబుతున్నారు. 30 నుంచి 49 సంవత్సరాలు: 30 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నవారు ఇయర్‌ఫోన్స్ వినియోగాన్ని వారానికి 5.5 గంటలు, నెలకు 23.9 గంటలు, సంవత్సరానికి 286 గంటలకు పరిమితం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 50 నుంచి 79 సంవత్సరాలు: ఈ వయస్సు గల వ్యక్తులు వారానికి గరిష్టంగా 5.2 గంటలు, నెలకు 22.6 గంటలు, సంవత్సరానికి 270.4 గంటలు ఇయర్‌ఫోన్స్ వినడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సలహా: హెడ్‌ఫోన్‌లను ఉపయోగించినప్పుడు వాల్యూమ్ 105-110 డెసిబెల్‌లను మించకూడదు. వీలైనంత వరకు వాల్యూమ్ తగ్గించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఏదైనా పరికరం 85 dB కంటే ఎక్కువగా ఉండి 2 గంటల పాటు ఉంటే వినికిడి లోపం ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది. అలాగే సంగీతాన్ని అధిక సౌండ్‌తో వింటే చెవులను అంతర్గతంగా దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక గంట కంటే ఎక్కువ సమయం పాటు బిగ్గరగా శబ్ధం వచ్చే హెడ్‌ఫోన్‌లను ఉపయోగించవద్దని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: పారాసెటమాల్ టాబ్లెట్ మోతాదు మించి వాడితే ఏమవుతుంది? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #head-phones మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి