Ego: ఈగోతో మీ కెరీరే నాశనం అవుతుంది.. ఎలాగో తెలుసుకోండి! ఈగో ఎక్కువైతే కెరీర్ గ్రోత్ ఆగిపోతుంది. అహం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.తమ తప్పులు లేదా బలహీనతలను గుర్తించకుండా నిరోధించేది అహమేనని గుర్తుపెట్టుకోండి. అహం ఎక్కువ ఉన్నవాళ్లు కొత్తగా ఆలోచించలేరు. ఫీడ్‌బ్యాక్‌లకు దూరంగా ఉంటారు.ఇతరుల నుంచి మంచి నేర్చుకోరు. By Vijaya Nimma 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఈగో(అహం) కూడా ఒక రోగమే.. ఈ మధ్య చాలా మంది దాన్ని ఏదో గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఈగో(Ego) వైఫై లాగా తిరుగుతుంటుందని సినిమా డైలాగులును రియల్ లైఫ్‌లో చెప్పుకుంటున్నారు. ఈగో వల్ల రిలేషన్స్ దెబ్బతినడమే కాదు.. కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది పరిశోధనలు చెబుతున్న మాట. అందుకే అనవసరమైన ఈగోను పక్కన పెట్టండి. ముందు ఈగోను గ్లోరిఫై చేయడం మానుకోండి. ఈగో వల్ల కెరీర్ ఎలా పాడవుతుందో తెలుసుకోండి. అహం కెరీర్‌ను ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకోండి: విభేదాలు: సహోద్యోగులతో అహం పనికిరాదు. ఉన్నతాధికారులతో ఇది విభేదాలకు దారి తీస్తుంది. వృత్తిపరమైన వాతావరణంలో సమర్థవంతంగా పని చేయడం కష్టమవుతుంది. ఇలా ఆహంతో ఉంటే వర్క్ పరంగా ఎవరూ మనకు సపోర్ట్ చేయరు. ఫీడ్‌బ్యాక్: అహం పెరిగితే అది వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమనే చెప్పాలి. ఈగోతో నిండిపోయిన మనిషి విమర్శలను లేదా అభిప్రాయాన్ని అంగీకరించలేడు. అహం ఒక వ్యక్తిని మార్పును అడ్డుకుంటుంది. కొత్త ఆలోచనలకు నిరోధకతను కలిగిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పని వాతావరణంలో వారి అనుకూలతను పరిమితం చేస్తుంది. నిర్ణయాధికారం: పెరిగిన అహం అతి విశ్వాసానికి దారితీయవచ్చు. దీనివల్ల వ్యక్తులు పేలవమైన నిర్ణయాలు తీసుకుంటారు. పొంచి ఉన్న ప్రమాదాలను తక్కువగా అంచనా వేస్తారు. ప్రతీకాత్మక చిత్రం ఇతరులను దూరం చేయడం: మితిమీరిన అహంతో ఉన్న వ్యక్తులతో ఎక్కువమంది కలవరు. స్వీయ-అవగాహన లేకపోవడం: అహం వ్యక్తులను వారి సొంత లోపాలను గుర్తించకుండా చేస్తుంది. వారికి అభివృద్ధి అవసరమైన వీక్‌పాయింట్లను గుర్తించకుండా నిరోధించవచ్చు. విజయవంతమైన వృత్తిని కలిగి ఉండటానికి వినయం అన్నిటికంటే ఎక్కువగా అవసరం. అహం అన్నిటికంటే తక్కువ అవసరం. క్లోజ్డ్ మైండెడ్‌నెస్: అహం ఎక్కువ ఉన్నవాళ్లు కొత్తగా ఆలోచించలేరు. ఫీడ్‌బ్యాక్‌లకు దూరంగా ఉంటారు.ఇతరుల నుంచి మంచి నేర్చుకోరు. అన్ని తమకే తెలుసులే అని ఫీల్ అవుతుంటారు. అహం తరచుగా ప్రజలు తమ తప్పులు లేదా బలహీనతలను గుర్తించకుండా నిరోధిస్తుంది. ఇది వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అహంతో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టాస్క్‌లు లేదా ప్రాజెక్ట్‌ల కోసం పరఫెక్ట్‌గా సిద్ధం చేయడంలో వైఫల్యానికి దారి తీస్తుంది. తమ సహోద్యోగులతో రాజీ పడడానికి, క్రెడిట్‌ని పంచుకోవడానికి లేదా సమర్థవంతంగా సహకరించడానికి అహం ఎక్కువ ఉన్న మనుషులు ఇష్టపడకపోవచ్చు. ఇది కెరీర్ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. Also Read: ఈ ఒక్క చిట్కా పాటించండి చాలు.. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు! #life-style #career-tips #ego మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి