Coffee Tea: వర్క్ చేస్తూ కాఫీ, టీ ఎక్కుగా తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకుంటే మళ్లీ అలా చేయరు! By Trinath 27 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Side Effects of Coffee, Tea: చాలామంది మద్యం సేవించడాన్ని హానికారంగా భావిస్తారు కానీ.. అధికంగా ఏం తాగినా అది అనర్థమేనని గ్రహించరు. అడిక్షన్ ఏదైనా ప్రమాదకరమే. అది మద్యం కావొచ్చు, సిగరేట్ కావొచ్చు, కూల్ డ్రింక్ కావొచ్చు, చదువు, ఆటలు, కాఫీ(Coffee) , టీ(Tea) కావొచ్చు ఇలా ఏదైనా కావొచ్చు. అయితే ఎక్కువ మందికి అలవాటు ఉండే వాటిని సమాజం నార్మలైజ్ చేసి చూస్తుంటుంది. అందుకే కాఫీ, టీతో వచ్చే సమస్యల కంటే లాభాల గురించే ప్రజలకు ఎక్కువగా తెలుసు. కాఫీ, టీ అన్నది ఇప్పుడు అన్ని చోట్లా కామన్‌గా మారిపోయింది. ఎవరి ఇంటికైనా వెళ్తే కాఫీ లేదా టీ ఇస్తుంటారు. ఇటు వర్క్ ప్లేస్‌లో ఈ రెండిటిలో ఒకటి తాగే వారి అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాఫీ పడకపోతే పని జరగదు, టీ లేకపోతే బుర్ర పనిచేయదు లాంటి డైలాగులు వినిపిస్తుంటాయి. అయితే వీరంతా తెలియకుండా ఈ కాఫీ లేదా టీకి అడిక్ట్ ఐనట్టు లెక్క. బాడీకి కావాల్సినంతా హైడ్రెషన్ ఇచ్చే వాటర్‌ని కాకుండా కాఫీ, టీని అలవాటు చేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. తక్కువగా తాగితే పర్లేదు కానీ.. ఆ రెండిటిలో ఒకటి లేకపోతే పని చేయలేకపోవడం లాంటివి అనుభవిస్తుంటే మాత్రం జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం (PC/Unsplash) కెఫిన్‌తో డేంజర్ బాసూ: అధిక మొత్తంలో టీ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే అందులో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 'టీ'లోని కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల ఆందోళన, భయం లాంటి ఫీలింగ్స్‌కు వస్తాయి. అధిక టీ లేదా కాఫీ వినియోగం జీర్ణ సంబంధిత సమస్యలను తీసుకొస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు కూడా కారణం. ప్రతీకాత్మక చిత్రం (PC/Unsplash) అడిక్షన్‌కు వెళ్తారు: రెగ్యులర్‌గా అధికంగా టీ లేదా కాఫీ తాగడం వాటిపై పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. ఎప్పుడైనా అవి తాగలేకపోతే తలనొప్పి పుడుతుంది. ఇది అడక్షన్ లక్షణం. సడన్‌గా టీ లేదా కాఫీకి దూరమైతే చాలా చిరాకుగా, అలసటగా అనిపిస్తుంది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వర్క్ సమయంలో ఎక్కువగా ఇవి తాగుతుంటారు. అవి లేకపోతే పని జరగదని మానసికంగా ఒక ఫీలింగ్‌కు ఫిక్స్ అవుతారు. కెఫిన్ కంటెంట్ వల్ల ఎనర్జీ వస్తుందన్న మాట నిజమేకానీ.. అది ఒక డ్రగ్ టైప్ అడిక్షన్‌కు దారి తీస్తుందని గుర్తించాలి. అందుకే ఎంత తాగాలో అంతే తాగాలి. అవి లేకున్నా పని చేసుకోగలగలి. నిద్ర ఆగాలంటే టీ తాగుతారు చాలా మంది. అలా నిద్ర ఆపే శక్తి కెఫిన్‌కు ఉందంటే దాని వల్ల అనర్థాలను కూడా ఊహించుకోవచ్చు. Also Read: యూత్‌కి గుడ్‌న్యూస్.. RTVలో జాబ్స్.. అప్లై చేసుకోండిలా WATCH: #health-tips #life-style #tea #coffee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి