Hair Growth: నేటికాలంలో జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మీరు అనేక రకాల రెమెడీస్ ఫాలో అవుతూ ఉండొచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మార్కెట్లో అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించి కూడా మీ జుట్టును పెంచుకోవచ్చు. జుట్టు పెరగడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి, హెయిర్ పొడవును పెంచడానికి మీకు ఒక అద్భుతమైన రెమెడీని ఇవాళ చెప్పబోతున్నాం..!
2015లో జరిగిన ఓ అధ్యయనం ఓ విషయాన్ని స్పష్టం చేసంది. పరిశోధకులు మానవ జుట్టుపై మొక్కల ఆధారిత నూనెల వాడకాన్ని పరీక్షించారు. కొబ్బరి నూనె సహజ జుట్టు ప్రోటీన్తో సమానంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. కొబ్బరి నూనె జుట్టును సంరక్షించడంలో చేసే మేలు అంతా ఇంతా కాదు! మరోవైపు కొబ్బరి నూనెలో మరో మిశ్రమం యాడ్ చేసి అప్లై చేస్తే జుట్టు నిగనిగలాడడం ఖాయమంటున్నారు నిపుణులు.. ఆ రెమెడీ ఏంటో తెలుసుకోండి.
➊ పొడవాటి జుట్టు కోసం మొదట కొబ్బరి నూనెను వేడి చేయండి. తర్వాత అందులో గుప్పెడు మెంతులు వేయాలి.
➋ మెంతులను నూనెలో మరిగించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కలబంద తాజా ఆకులు వేయాలి. వేప, జాస్వండా ఆకులు, కరివేపాకు వేయాలి. నూనెను బాగా మరిగించాలి. తరువాత గ్యాస్ ఆఫ్ చేసి కుండను గ్యాస్ నుంచి తీసి చల్లారనివ్వండి.
➌ ఈ నూనెను ఇలా 3 రోజులు ఉంచండి. తర్వాత నూనె కరిగించి కుండలో వేయాలి. మీరు ఈ నూనెను వడపోత లేదా కాటన్ క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేయవచ్చు. వడకట్టిన నూనెను జుట్టుకు అప్లై చేసి.. హెయిర్‌ను తేలికగా మసాజ్ చేయండి.
➍ నూనె కరిగిన తర్వాత పైన మిగిలిపోయిన మెటీరియల్ ఉపయోగించి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు కోల్పోయిన మెరుపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: మహిళలను మానసికంగా ఆరోగ్యంగా ఉంచే ఆర్ట్ థెరపీ
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.