Houthis: అమెరికా నౌకపై దాడి చేశాం.. హౌతీ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన

ఎర్రసముద్రంలో అమెరికా కంటెయినర్ నౌకపై దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ నౌక పాలస్తీనాలోని ఆక్రమిత పోర్టు ( ఇజ్రాయెల్‌)కు వెళ్తోందని చెప్పారు. అమెరికా - బ్రిటన్ నౌకలపై దాడి చేసేందుకు ఆలోచించమని.. నౌకలన్ని మా పరిధిలో ఉన్నట్లు హెచ్చరించారు.

New Update
Houthis: అమెరికా నౌకపై దాడి చేశాం.. హౌతీ తిరుగుబాటుదారుల సంచలన ప్రకటన

ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. అమెరికా కంటెయినర్ నౌకపై తాము దాడి చేశామని తాజాగా హౌతీ రెబల్స్ ప్రకటన చేశారు. గల్ఫ్ ఆఫ్‌ ఎడెన్‌లో అమెరికాకు చెందిన 'ది కేఓఐ'పై దాడికి పాల్పడ్డామని చెప్పారు. తాము ప్రయోగించిన యాంటీ షిప్‌ క్షిపణులు కంటెయినర్లను తాకాయన్నారు. అయితే ఈ నౌక పాలస్తీనాలోని ఆక్రమిత పోర్టు ( ఇజ్రాయెల్‌)కు వెళ్తోందని చెప్పారు. అంతేకాదు అమెరికా - బ్రిటన్ నౌకలపై దాడి చేసేందుకు తాము ఏమాత్రం ఆలోచించమని.. నౌకలన్నీ కూడా మా లక్ష్యాల పరిధిలోనే ఉన్నాయని హౌతీ రెబల్స్ హెచ్చరించారు.

Also Read: రూ.లక్ష కోట్లు కాజేసి దేశాన్నే కుదిపేసిన మహిళ..

అది ఏ ఓడ ?

అయితే ఎడెన్‌ నౌకశ్రయానికి దక్షిణాన కంటెయినర్‌లో పేలుడు జరిగినట్లు యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్‌ ట్రెడ్ ఆపరేషన్స్ చెప్పింది. అయితే అది ఏ ఓడనో అనేది మాత్రం స్పష్టం చెెప్పలేదు. కేఓఐ నౌక.. యూకే ఆధారిత ఓషియోనిక్స్‌ సర్వీసెస్‌ ద్వారా నిర్వహిస్తున్న లైబీరియాన్‌ పతాకంతో ప్రయాణిస్తున్న కంటైనర్‌ షిప్‌ అని ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. అయితే ఇదే కంపెనీకి చెందిన నౌకల్లో గతంలో దెబ్బతిన్న ట్యాంకర్ మార్లిన్ కూడా ఉంది.

అమెరికాకు సవాలుగా మారిన హౌతీలు

ఇదిలాఉండగా.. యెమెన్‌లో డ్రోన్‌లను టార్గెట్‌గా చేసుకొని యూఎస్‌ తాజాగా వైమానిక దాడులు ప్రారంభించినట్లు సమాచారం. అయితే హౌతీ గ్రౌండ్ కంట్రోల్‌ స్టేషన్‌తో సహా.. ప్రయోగం చేసేందుకు సిద్ధం చేసిన 10 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు యూఎస్‌ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా యుద్ధనౌకలు, కంటైనర్లకు హౌతీలు సవాలుగా మారారని తెలిపింది. ఎడెన్‌లో ఉన్న తమ యుద్ధనౌక మూడు ఇరాన్‌కు చెందిన డ్రోన్‌లు, ఒక యాంటీ షిప్ బాలిస్టిక్‌ క్షిపణిని కూల్చివేసినట్లు అమెరికా వివరించింది.

Also Read: వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు