Dead Body : భద్రాద్రి(Bhadradri) కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనంగా రూ.30 వేలు ఇవ్వాలంటూ ప్రైవేటు ఆసుపత్రి డిమాండ్(Hospital Demands) చేసింది. ఆ గిరిజిన కుటుంబం ఎంత బతిమిలాడిన వాళ్లు ఒప్పుకోలేదు. అంత మొత్తం ఇవ్వలేమని భావించిన ఆ కుటుంబ సభ్యులు చివరికి మధ్యవర్తులతో రాజీ కుదుర్చుకున్నారు. రూ.7 వేలు చెల్లించి తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏపీ(AP) లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కురుమలతోగులో మడకం దేవ (8) అనే బాలుడు అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి(Private Hospital)కి తీసుకొచ్చారు.
Also Read: ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ.. ఎలా చిక్కాడంటే?
అయితే ఆ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. బాలుడి మృతదేహాన్ని అప్పగించడానికి ఆసుపత్రి యాజమాన్యం అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. ఆ కుటుంబ సభ్యులు తాము అంత మొత్తం చెల్లించలేమని బతిమిలాడినప్పటికీ ఆ ఆసుపత్రి వర్గాలు ఒప్పుకోలేదు. చివరికి మధ్యవర్తుల ద్వారా రూ.7వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకొచ్చిందని వాపోయారు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ వ్యవహారం నిలిపేయండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ!