BAAK: భయంకరమైన బాక్ ట్రైలర్.. అదరగొట్టేసిన తమన్నా!

హారర్, కామెడీ ‘బాక్’ నుంచి మరో బిగ్ అప్ డేట్ వెలువడింది. తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రలో నటించిన మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. భయంకరమైన సన్నివేశాలతో తమన్నా భాటియా, రాశి ఖన్నాలు అదరగొట్టేశారు.

BAAK: భయంకరమైన బాక్ ట్రైలర్.. అదరగొట్టేసిన తమన్నా!
New Update

BAAK: స్టార్ నటి తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బాక్’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ భారీ అంచనాలు పెంచేయగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ మేరకు ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో హారర్ సీన్స్ ఆకట్టుకున్నాయి. తమన్నా భాటియా, రాశి ఖన్నాలు అదరగొట్టేశారు. ఇక వెన్నెల కిషోర్, సునీల్, యోగి బాబు, శ్రీనివాస రెడ్డి, కెఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుందర్ భార్య ఖుష్భు సుందర్ మరియు ACS అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సినిమా మొత్తం రన్‌టైమ్ దాదాపు 148 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఇక అరణ్మనై 4 (తమిళం) చిత్రం తెలుగులో బాక్ అనే టైటిల్ తో మే 3, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

#tamannaah-bhatia #raasi-khanna #baak
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe