ముఖానికి మరింత అందం తీసుకొచ్చేది నవ్వు మాత్రమే. నవ్వుతోనే ఇతరులను కూడా ఆకట్టుకోవచ్చు. కానీ అలా నవ్వినప్పుడు మన పళ్లు అనేవి బయటికి వస్తాయి. కానీ పళ్లపై పసుపు గారలు, నోటి దుర్వాసన ఉంటే మాత్రం నోరు తెరిచేందుకే కొందరు భయపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు కొన్ని చిట్కాలు పాటిస్తే దీని బయటపడొచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి రసం తీసిన నిమ్మతొక్కతో పళ్లను రుద్దుకుంటే కేవలం పసుపు మరకలు మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. కానీ నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఒకవేళ ఎక్కువగా రుద్దితే పళ్లు బలహీనం అయిపోతాయి.
Also Read: చలికాలంలో ఎక్సర్‌సైజ్ ఇబ్బందిగా ఉందా..? అయితే ఇలా ట్రై చేయండి
అలాగే తులసి ఆకులు,ఎండిన నారింజ తొక్కలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. ముందుగా 7 తులసి ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్దిగా తీసుకోని మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి మెత్తగా ఓ పెస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. చివరకి పళ్లు తెల్లగా మారుతాయి. మరోవైపు ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు బేకింగ్ సోడాలో నీరు పోసి పేస్ట్‌లా చేసిన దీన్ని పళ్లకు అప్లై చేస్తే.. వాటిపై ఉన్న పసుపు మరకలు కూడా పోతాయి. అలాగే ఉప్పు నిమ్మరసం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: వంటగదిలో ఇలా చేస్తే చీమలు, పురుగులు పరార్