Nowhera Shaikh : ఇటీవల సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్(Bandla Ganesh) పై చెక్ బౌన్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్(Nowhera Shaikh) ఆయనపై సంచలన ఆరోపణలు. బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్న ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. హైదరాబాద్(Hyderabad) లో హీరా గ్రూప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో నౌహీరా మీడియాతో మాట్లాడారు. ఫిలింనగర్(Film Nagar) లో సుమారు రూ.75 కోట్ల విలువైన ఇంట్లోని మొదటి ఫ్లోర్‌ను బండ్ల గణేష్‌కు 2021 జూన్ 5న అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. 11 నెలల రెంటల్ అగ్రిమెంట్ కూడా చేసినట్లు పేర్కొన్నారు.
Also Read : వచ్చేసారి తెలంగాణలో బీజేపీదే అధికారం: జేపీ నడ్డా
ఫోర్జరీ చేశారు
గడువు ముగిసిన తర్వాత బండ్ల గణేష్ ఇంటిని ఖాళీ చేయలేదని చెప్పారు. అలాగే ఈడీ అధికారులు ఇంటిని అటాచ్ చేశారని తెలుసున్న ఆయన.. అడ్డదారిలో ఇల్లు మొత్తాన్ని తన ఆధినంలోకి తీసుకుని వేధింపులకు గురి చేస్తున్నాడని నౌహీరా ఆరోపణలు చేశారు. 11 నెలలు చేసిన రెంటల్ అగ్రిమెంట్‌ను ఫోర్జరీ చేసి 9 ఏళ్లు అద్దెకు తీసుకున్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని.. తక్కువ ధరకే ఇంటిని అమ్మాలని ఒత్తిడి తెస్తున్నట్లు పేర్కొన్నారు.
డీజీపీకి ఫిర్యాదు చేశా
గురువారం మధ్యాహ్నం అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడికి వెళ్లానని.. కానీ తనపై రౌడీల సాయంతో దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. అలాగే తనపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. ఇంటిని ఆక్రమించుకున్న బండ్ల గణేష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు ఆయనకే సపోర్ట్ చేయడం భాదాకరమన్నారు. ఫిలింనగర్ పోలీసుల వైఖరిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని.. సోమవారం నగర పోలీస్ కమిషనర్‌ను కలుస్తానని చెప్పారు.
Also Read : మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు : సీఎస్ శాంతి కుమారి