ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తలో నిలుస్తున్నారు. మహిళల శృంగారంపై నోరు జారిన బిహార్ సీఎం నితీష్ తివారీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్ గా అసోం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేయగా దీనిపై ఈసీ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
Read Also :Big Breaking: పొంగులేటి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..
ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న హిమంత ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే దేశంలో మళ్లీ బాబర్లు, ఔరంగజేబ్‌లను ప్రోత్సహించడమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలపై దౌర్జన్యాలు మొదలవుతాయి. ఇటీవల కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ అదే పని చేస్తోంది. ఆ రాష్ట్రానికి బాబర్లు, ఔరంగజేబులకు ఎక్కడి నుంచి ఆక్సిజన్ అందిందో తెలియదు. కానీ దారుణంగా చెలరేగిపోతున్నారంటూ హిమంత ఆరోపించారు. ప్రస్తుతం హిమంత వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా దీనిపై ఇంకా కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. ఇదిలావుంటే.. అక్టోబర్ లో ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న హిమంత ఇదే తరహా కామెంట్స్ చేశారు. అక్బర్‌ను ఓడించి ఇంటికి పంపించకపోతే కౌసల్య మాత భూమి అపవిత్రం అవుతుంది. ఒక అక్బర్‌ను ఎక్కడో ఒకచోట అనుమతిస్తే అతడు 100 మంది అక్బర్‌లను పిలుచుకుంటాడు. కాబట్టి అతన్ని వీలైనంత త్వరగా పంపేయాలన్నారు. అయితే దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. అయినా ఏ మాత్రం తన తీరు మార్చుకోకుండానే మళ్లీ అదే తరహాలో కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విశేషం.