Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్.. భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు విపక్ష నేతలు, నెటిజన్లు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన కంగనా.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దీనికి సంబంధించిన కారణాలను వివరిస్తూ.. ఓ న్యూస్ ఆర్టికల్‌ను పోస్టు చేశారు.
Also Read: కేసీఆర్ పర్యటనలో దొంగల దూకుడు
ఆ న్యూస్ ఆర్టికల్‌లో '1943, అక్టోబర్ 21న సింగపూర్‌లో సుబాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో.. సుభాష్ చంద్రబోస్ తనకు తాను ప్రధానమంత్రిగా, రాష్ట్రాధిపతిగా, యుద్ధ మంత్రిగా ప్రకటించున్నాడు'. అని ఉంది. ఈ ఆర్టికల్‌ని పోస్ట్ చేసిన కంగనా.. దీనికి క్యాప్షన్‌గా కొన్ని విషయాలు వివరించింది. మొదటి ప్రధానమంత్రి ఎవరో అని నాకు జ్ఞానబోధ చేస్తున్నవాళ్లు ఈ ఆర్టికల్‌ను చదవండి.ఇది బిగినర్లకు జనరల్ నాలెడ్జ్.
నన్ను విద్య నేర్చకోమ్మని చెబుతున్న మేధావులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేను 'ఎమర్జెన్సీ' అనే సినిమా కథను రాశాను, అందులో నటించాను, ఆ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమా ముఖ్యంగా నెహ్రూ కుటుంబం చుట్టే తిరుగుతుంది. నాపై కామెంట్లు చేయడం ఆపండని' కంగనా పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రౌనత్ పోటీ చేయనున్నారు.
Also Read: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటన.. విచారణలో బీజేపీ కార్యకర్త