AP: ఏపీలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకోగా...చాలా చోట్ల ప్రశాంతంగానే ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో అందరి చూపు ఓ నియోజకవర్గం పైనే ఉంది. ఆ నియోజకవర్గమే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం.
ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఈసారి అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చివరి నిమిషం వరకు కూడా పార్టీలన్ని తమ శాయశక్తుల ప్రయత్నించాయి. పిఠాపురంలో 2 లక్షల 38 వేల మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ జరిగింది.
ఇంకా భారీగా క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే జనసేన అధినేతకు ప్రత్యర్థిగా బరిలో నిలిచిన వంగా గీత పలు కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. కానీ పోలింగ్ ను పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పిఠాపురం రాలేదు.