Vijayawada: భయం..భయంగా బెజవాడ..రోడెక్కిన అంగన్వాడీలు అరెస్ట్..!!

విజయవాడలో టెన్షన్‌ వాతవరణం నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంకు వెళ్తున్న అంగన్వాడిలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో అంగన్ వాడీ వర్కర్లు గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరు బాట పట్టారు.

Vijayawada: భయం..భయంగా బెజవాడ..రోడెక్కిన అంగన్వాడీలు అరెస్ట్..!!
New Update

Vijayawada: విజయవాడలో టెన్షన్‌ వాతవరణం నెలకొంది. ఛలో విజయవాడ కార్యక్రమంకు వెళ్తున్న అంగన్వాడిలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో అంగన్ వాడీ వర్కర్లు గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరు బాట పట్టారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకుని భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అంగన్వాడిలు. అయితే, పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా వేతనాలు పెంపు, మినీ అంగన్ వాడీ వ్యవస్ధ రద్దు, అధికారుల వేధింపులు తగ్గించాలన్న డిమాండ్లతో అంగన్ వాడీ వర్కర్లు ఉద్యమిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరు బాట పట్టారు.అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న అంగన్ వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకుని  అరెస్ట్ చేశారు.

విజయవాడలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ, సీఆర్పీసీ, పోలీసు చట్టాల ప్రకారం చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం కొంతమంది బయటి వ్యక్తులు ఈ ధర్నా కార్యక్రమములో చేరి హింసకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని, ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఏ విధమైన అనుమతులు ఇవ్వలేదన్నారు. అంగన్వాడి కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు సిఐటియు సీఐటీయూ నాయకులు. ప్రభుత్వానికి తమ మోర వినిపించడానికి వెళుతుంటే పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం మానవ హక్కులను కలరాయడమే అంటూ మండిపడుతున్నారు.

Also Read: నిజామాబాద్ లో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

#ap-assembly #ap #vijaywada #ap-police #anganwadi-protest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe