Congress Khammam MP Ticket: భట్టికి షాక్ ఇచ్చిన మంత్రి పొంగులేటి? TG: ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటి వరకు ఖమ్మం ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదు. తాజాగా ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. By V.J Reddy 23 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Congress Khammam MP Ticket: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. రఘురామిరెడ్డి తరపున పొంగులేటి అనుచరులు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ ఖమ్మం కాంగ్రెస్ లో తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఎంపీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకూ తేల్చలేదు. ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి, పొంగులేటి వర్గాల పట్టు పడుతున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపుతోంది వేచి చూడాలి. #minister-ponguleti-srinivas #congress-khammam-mp-ticket #bhatti-vikamarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి