Ap Politics : తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్‌

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జూన్ 4 న జరిగే కౌంటింగ్‌ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

New Update
Ap Politics : తాడిపత్రిలో కొనసాగుతున్న హై టెన్షన్‌

Tadipatri : ఏపీ (Andhra Pradesh) లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) ముగిసినప్పటికీ ఇంకా టెన్షన్‌ వాతావరణం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు ముగిసిన తరువాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జూన్ 4 న జరిగే కౌంటింగ్‌ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

పోలింగ్‌ నాటి గొడవలు ఏమి కూడా రిపీట్‌ అవ్వకుండా గట్టి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వివరించారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చేందుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొందరు ప్రధాన పార్టీల నేతలు అయితే ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

పోలింగ్‌ రోజు ... ఆ తరువాత జరిగిన దాడుల్లో మొత్తం 728 మందిని నిందితులుగా గుర్తించిన సిట్‌ అధికారులు. ఇప్పటి వరకు 110 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించిన పోలీసు అధికారులు. తాజాగా మరో 119 మందిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం సిట్ బృందం గాలిస్తుంది.

జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy), జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, కేతిరెడ్డి సాయిప్రతాప్‌రెడ్డిలపై. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. జూన్‌ 4న కౌంటింగ్‌ నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలర్ట్‌ అయ్యారు. గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జేసీ, పెద్దారెడ్డి కుటుంబీకులు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గరకు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Also read: మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

Advertisment
తాజా కథనాలు