Dikshabhumi: నాగ్‌పూర్‌లోని అంబేద్కర్ దీక్షాభూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ నిర్మాణాన్ని దళిత సంఘాలు అడ్డుకున్నాయి. నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పలు షెడ్లు ధ్వంసం చేశాయి. తీవ్ర నిరసనల నేపథ్యంలో పార్కింగ్ నిర్మాణం పనులు నిలిపేసినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ కారణంగా దీక్షాభూమి నిర్మాణం దెబ్బతింటుందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అంబేద్కర్ దీక్షాభూమి సుందరీకరణలో భాగంగానే.. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ తలపెట్టామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇదిలాఉండగా.. 1956లో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్.. ఇదే స్థలంలో బౌద్ధమతాన్ని స్వీకరించారు. 2001లో అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ఆ ప్రాంతంలో దీక్షాభూమిని ప్రారంభించారు.
Also Read: కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ